
ది గ్రేట్ ఇండియన్ GST ఫెస్టివల్.. జీఎస్టీ 2.0.. సెప్టెంబర్ 22.. సోమవారం అమలులోకి రానుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 56వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి.. ఇకపై 5, 18, 40 శాతం పన్ను స్లాబులు ఉండనున్నాయి.. 200పైగా వస్తువులపై పన్ను తగ్గించి, మధ్యతరగతి, సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది. ఆహారం, పాల ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, దుస్తులు, ఫుట్ వేర్, విద్యా సామాగ్రి, ఆరోగ్యోపకరణాల ధరలు తగ్గనున్నాయి.. గతంలో 12 శాతం స్లాబ్‌లోని 99 శాతం వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వస్తాయి. 28 శాతం స్లాబ్‌లోని 90 శాతం వస్తువులు 18 శాతంలోకి రాబోతున్నాయి. దసరా, దీపావళి ముందు పన్ను రేట్లు తగ్గడంతో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి.