రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మన శరీరానికి తగినంత పోషకాలను అందిస్తాయి. వివిధ రకాల పండ్లు అనేక సూక్ష్మపోషకాల నిధి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాల సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ రోజు ఆరోగ్యానికి ఒక వరంగా పరిగణించబడే ఐదు చెట్ల గురించి మనం తెలుసుకుందాం.. ఈ మొక్కల పండ్లు మాత్రమే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
చెట్లు నీడను అందించడమే కాదు పోషణను అందిస్తాయి. ఆక్సిజన్ గాలికి అందిస్తాయి. శుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరరుస్తాయి. చెట్టులోని చాలా భాగాలు మానవులకు ఉపయోగపడతాయి. వేప, కరివేపాకు, పుదీనా, తులసి, తమలపాకు ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక రకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి. వీటి ఆకులు ప్రయోజనకరం. అయితే ఈ రోజు పోషకాలు అధికంగా ఉండే పండ్లను అందించడమే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగపడే ఆకులున్న చెట్ల గురించి తెలుసుకుందాం.