హైదరాబాద్, సెప్టెంబర్ 21: దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎస్ఈ) 2025 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల సమయంలో కొన్ని కేంద్రాల్లో రిమోట్ హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగినట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) గుర్తించింది. సెప్టెంబరు 12న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన సీజీఎల్ పరీక్షలు సెప్టెంబర్ 26 వరకూ జరగనున్నాయి. దేశవ్యాప్తంగా అనేక పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ భద్రతా వ్యవస్థల ద్వారా కొంత మంది అభ్యర్థుల కంప్యూటర్లను రిమోట్ టేకోవర్ చేసే ప్రయత్నాలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన వారిని డిబార్‌చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.
ఆన్‌లైన్ పరీక్ష సమయంలో ప్రతి కేంద్రంలోని ప్రతి అభ్యర్థి టెర్మినల్ వద్ద జరుగుతున్న పరిణామాలను సంగ్రహించే వివిధ భద్రతా లక్షణాలను అమలు చేసినట్లు SSC జారీ చేసిన నోటీసులో తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలు కమిషన్ నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. పరీక్షా ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆధారాలు, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఇటువంటి దుష్ప్రవర్తనలకు పాల్పడిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే అక్రమాలకు పాల్పడిన కేంద్రాలపై కూడా అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది. అభ్యర్థులందరూ ఎటువంటి అక్రమాలకు పాల్పడవద్దని సూచించింది. పరీక్షలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించడానికి కమిషన్ కట్టుబడి ఉందని వెల్లడించింది. కాగా SSC నిర్వహించే CGLE దేశంలోనే అతిపెద్ద పోటీ పరీక్షలలో ఒకటి. ప్రభుత్వ విభాగాల్లోని వివిధ గ్రూప్ B, C పోస్టుల నియామకాలకు లక్షలాది మంది యువత ప్రతీయేట పోటీ పడుతుంటారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంబీఏ (హెచ్‌హెచ్‌సీఎం)-2025 కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదల
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీఏ (హాస్పిటల్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదల చేసింది. ఐసెట్ లేదంటే వర్సిటీ నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఎవరైనా సెప్టెంబర్ 24న సీఎస్‌టీడీ యూనివర్సిటీ బిల్డింగ్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంబీఏ (హెచ్‌హెచ్‌సీఎం)-2025 కౌన్సెలింగ్ షెడ్యుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.