Actress Rohini: బర్త్ డే గిఫ్ట్ అద్దిరిపోయింది.. తల్లి నుంచి ఊహించని కానుక అందుకున్న జబర్దస్త్ రోహిణి

Actress Rohini: బర్త్ డే గిఫ్ట్ అద్దిరిపోయింది.. తల్లి నుంచి ఊహించని కానుక అందుకున్న జబర్దస్త్ రోహిణి


జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో కమెడియన్ రోహిణి కూడా ఒకరు. అంతకు ముందు పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైందీ అందాల తార. బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ రెండు సార్లు పాల్గొంది. ముఖ్యంగా గతేడాది బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి.. తన ఆటతో సివంగిగా గుర్తింపు తెచ్చుకుంది. విజేతగా నిలవకపోయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఓవైపు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూనే మత్తు వదలరా, బలగం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రోహిణి. ఇక సేవ్‌ ది టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది రోహిణి. ఇందులో ఆమె నటన అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఇలా టీవీ షోస్, సినిమాలతో నిత్యం బిజి బిజీగా ఉండే రోహిణి ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకొంది. సెప్టెంబర్ 08న ఆమె ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. తాజాగా తన బర్త్ డే నాడు వచ్చిన బహుమతులు, కానుకల గురించి వెల్లడించింది రోహిణి. తన ఫ్రెండ్స్‌ ఉంగరం, నెక్లెస్‌, హ్యాండ్‌ బ్యాంగ్‌, చీర వంటి కానుకలను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది.

తన పుట్టిన రోజు నాడు తన తల్లి ఊహించని బహుమతిచ్చిందంటూ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంరోహిణి. ఈ సందర్భంగా నటికి తల్లి నాలుగు బంగారు గాజులను గిఫ్ట్‌ ఇచ్చింది. ఆమె ఇచ్చిన గాజులను చూసి మురిసిపోయిన నటి తల్లిపై ముద్దుల వర్షం కురిపించింది. మా అమ్మ నాకోసం బంగారు గాజులు కొనిందోచ్‌ అంటూ యూట్యూబ్‌లో వీడియో షేర్‌ చేసింది. ఇకమీద ఇవే వేసుకుని తిరుగుతానంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు రోహిణీకి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

పుట్టిన రోజు వేడుకల్లో జబర్దస్త్ రోహిణి…

బర్త్ డే వేడుకల్లో రోహిణి ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *