అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీసీ రిజర్వేషన్లపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం కీలక సమావేశం నిర్వహించారు. జీవో ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వాహణకు 2 నెలల సమయం ఇవ్వాలని హైకోర్టును కోరబోతోంది ప్రభుత్వం.. బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలను హైకోర్టు వివరించాలని భావిస్తోంది. రెండు నెలల్లో ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 2,3 రోజుల్లో మరోసారి మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం అవుతారు. కోర్టుకు ఇచ్చే వివరణపై మరోసారి సమీక్ష చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి..