IND vs PAK : ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ పూర్తయ్యి, ఇప్పుడు టోర్నమెంట్ సూపర్-4 దశకు చేరుకుంది. ఈ దశలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌తో పాటు ఇతర కీలక మ్యాచ్‌లను కూడా వీక్షించవచ్చు. ఈ మ్యాచ్‌ల కోసం టికెట్లు ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. టికెట్ల ధరలు, బుకింగ్ పద్ధతి, అందుబాటులో ఉన్న ప్యాకేజీల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్
సూపర్-4 , ఫైనల్ మ్యాచ్‌లకు టికెట్లను అభిమానులు అధికారిక వెబ్సైట్ Platinumlist.net నుండి బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో రెండు రకాల టికెట్లు ఉన్నాయి. అవి స్టాండర్డ్ టికెట్స్ (సాధారణ టికెట్లు), హాస్పిటాలిటీ టికెట్స్ (ప్రీమియం సదుపాయాలతో కూడినవి). మీరు మీ బడ్జెట్, ప్రాధాన్యతను బట్టి వీటిని ఎంచుకోవచ్చు.
టికెట్ ప్యాకేజీలు, ధరలు
సూపర్-4 దశలోని మ్యాచ్‌లను చూడటానికి రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
ప్యాకేజ్ A: ఈ ప్యాకేజీలో టికెట్ల ధర AED 525 (సుమారు రూ.12,617) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ కొనుగోలు చేస్తే మీరు ఈ మూడు మ్యాచ్‌లను చూడవచ్చు:
శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్
భారత్ వర్సెస్ పాకిస్తాన్
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
ప్యాకేజ్ B: ఈ ప్యాకేజీలో కూడా టికెట్ల ధర AED 525 (సుమారు రూ.12,617) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో రెండు సూపర్-4 మ్యాచ్‌లు, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ చూడవచ్చు
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్
భారత్ వర్సెస్ శ్రీలంక
ఫైనల్ (సెప్టెంబర్ 28)
సూపర్-4 పూర్తి షెడ్యూల్
సెప్టెంబర్ 20: శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్, దుబాయ్ (సాయంత్రం 6:30 గం.)
సెప్టెంబర్ 21: భారత్ వర్సెస్ పాకిస్తాన్, దుబాయ్ (సాయంత్రం 6:30 గం.)
సెప్టెంబర్ 23: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, అబు ధాబి (సాయంత్రం 6:30 గం.)
సెప్టెంబర్ 24: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, దుబాయ్ (సాయంత్రం 6:30 గం.)
సెప్టెంబర్ 25: పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, దుబాయ్ (సాయంత్రం 6:30 గం.)
సెప్టెంబర్ 26: భారత్ వర్సెస్ శ్రీలంక, దుబాయ్ (సాయంత్రం 6:30 గం.)
సెప్టెంబర్ 28: ఫైనల్, దుబాయ్ (సాయంత్రం 6:30 గం.)
సెప్టెంబర్ 29: రిజర్వ్ డే
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్-4 మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ప్యాకేజీలు క్రికెట్ అభిమానులకు స్టేడియం నుంచే మ్యాచ్‌లు చూసే అవకాశం కల్పిస్తాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..