అమరావతి, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో కాలేజీల బంద్‌కు సంబంధించిన వ్యవహారం సర్దుమనిగిన సంగతి తెలిసిందే. ఇక పొరుగున ఉన్న ఏపీలోనూ ఇప్పుడు సమ్మె సైరన్ మోగనుంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో బోధన రుసుములను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాయి. లేదంటే సెప్టెంబరు 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలను మూసివేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నాన జయరాం, పొదిలి పెద్దిరాజు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళగిరిలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తికి వినతిపత్రం సైతం సమర్పించారు.
వెంటనే బోధన రుసుములను విడుదల చేయకపోవడంతో సర్కార్ జాప్యం చేస్తుంది. ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం మాత్రం లభించడం లేదని ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం పేర్కొంది. వర్సిటీలకు ఫీజులు కట్టకపోతే పనులు చేయడం లేదని వాపోయారు. ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల రుసుములను విడుదల చేయకుండా జప్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక, కాలేజీల్లో మౌలికసదుపాయాలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ ఫీజులు చెల్లించాలని కోరింది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబరు మొదటి వారంలో నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రైవేట్ కాలేజీల బంద్‌కు కార్యాచరణ రూపొందించినట్లు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.