ఎప్పటిలాగే ఈ వారం కూడాఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన మూవీస్, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఓ హారర్ థ్రిల్లర్ మూవీకూడా ఉంది. భయపెట్టే సన్నివేశాలు, ఒళ్లు గగర్పొడిచే ట్విస్టులతో సాగే ఈ సినిమా హారర్ థ్రిల్లర్స్ ఫ్యాన్స్ కు ఓ మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పుకోవచ్చు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. 60 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా 151.2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. అంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1331 కోట్ల కలెక్షన్లు సాధించిందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలోని కొన్ని సీన్లను ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రోతో షూట్ చేయడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2002లో ఓ వైరస్ వచ్చి ప్రపంచాన్ని వల్లకాడులా మారుస్తుంది. మనుషులంతా రాక్షసుల్లా మారిపోతారు. జనాలను చంపుతారు. సరిగ్గా 28 ఏళ్ల తర్వాత మరోసారి ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మరి ఇప్పుడు ఆ వైరస్ ను ఎలా కట్టడి చేశారు. రాక్షసులుగా మారిన వాళ్ల నుంచి హీరో కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అన్నదే కథ. ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం.
బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్’. హారర్ థ్రిల్లర్ 28 ఇయర్స్ లేటర్ మూవీ హారర్ ఫ్రాంఛైజీలో మూడో పార్ట్ గా వచ్చింది. ఇంతకుముందు ఇందులో 2002లో 28 డేస్ లేటర్, 2007లో 28 వీక్స్ లేటర్ మూవీస్ వచ్చాయి. 2025 జూన్ లో 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్ రిలీజైంది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో ఈ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవతోంది.ఇంగ్లిష్, తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
28 ఇయర్స్ లేటర్ మూవీని డ్యానీ బోయ్ లే తెరకెక్కించారు. ఇందులో జోడీ కార్నర్, ఆరోన్ టేలర్, జాక్ ఓ కానెల్ తదితరులు నటించారు. హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్ మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.