వేద క్యాలెండర్ ప్రకారం ఈ రోజు భాద్రప్రద మాసం అమావాస్య తిథి. ఈ రోజుని మహాలయ అమావస్యగా జరుపుకుంటారు. ఈ రోజు పూర్వీకులకు తర్పణం (నైవేద్యం), శ్రార్ధ కర్మలను, పిండ ప్రదానం వంటి కార్యక్రమాలను చేస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం అమావాస్య రోజున ఈ ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకులు సంతోషపడతారు. పితృ దోష సమస్య తొలగుతుంది. ఈ రోజున మరో విశిష్టత కూడా ఉంది.
ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం సర్వ పితృ అమావాస్య నాడు సంభవిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో పూజలు చేయడం, ఆహారం తినడం నిషేధించబడింది. గ్రహణం సమయంలో నియమాలను పాటించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఈ రోజున సూర్యగ్రహణం సమయంలో చేయవలసినవి, చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాం..
సూర్యగ్రహణం 2025 తేదీ, సమయం
భారతదేశంలో సూర్య గ్రహణం 2025 తేదీ , సమయం ప్రకారం.. సూర్యగ్రహణం ఈ రోజు ( సెప్టెంబర్ 21) రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై తెల్లవారు జామున 3:23 గంటలకు ముగుస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. రాత్రి సమయంలో ఏర్పడే గ్రహణం కనుక మన దేశంలో గ్రహణం కనిపించదు.
సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయాలి
- సూతక కాలానికి ముందు ఇంట్లో పూజ గది తలుపులు మూసివేయండి.
- తినే ఆహారంలో తులసి దళాలను, దర్భలను చేర్చుకోవాలి.. ఆహారంలో తులసి ఆకులను జోడించడం వల్ల గ్రహణం ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చని నమ్ముతారు.
- సూర్యగ్రహణ సమయంలో దేవతలకు సంబంధించిన మంత్రాలను జపించండి.
- గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయండి.
- పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసి, గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి.
- పూజ చేసిన తర్వాత, ఆహారం, డబ్బు మొదలైన వాటిని దానం చేయండి.
- సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు
- సూర్యగ్రహణం సమయంలో పూజలు నిషేధించబడ్డాయి . దేవుళ్ళ విగ్రహాలను తాకకూడదు.
- గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు.
- అంతేకాదు పదునైన వస్తువులను ఉపయోగించవద్దు.
- ఏ రకమైన శుభ కార్యాలను కూడా నిర్వహించరాదు. ఇలా చేయడం వల్ల శుభ కార్యాలకు తగిన ఫలితాలు లభించవు.
- ఆహారం తినకూడదు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు