తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం బతుకమ్మ పండగ. భాద్రప్రద మాసం అమావాస్య నుంచి ప్రారంభం అయ్యే ఈ సంబురాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ప్రకృతితో మమేకమై ఈ పండగను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రంగు రంగుల పువ్వులను బతుకమ్మగా పేర్చి .. మహిళలంతా ఒక చోటకు చేరి ఆడి పాడతారు. నేటి నుంచి (సెప్టెంబర్ 21) ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ పండగ బురాలు మొదలుకానున్నాయి.
బతుకమ్మ అంటే బతుకు అంటే తెలుగులో జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దీనినే బతుకమ్మ అని అంటారు. అంటే.. జీవితమంతా సంతోషకరంగా సాగిపోవాలనేది ఈ బతుకమ్మ పండుగ ఆంతర్యం. భాద్రప్రద అమావాస్య ని తెలంగాణలో పెత్ర అమావాస్య అంటారు. ఈ రోజున , గుమ్మడి, గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పువ్వులతో అందమైన బతుకమ్మని పేరుస్తారు. తోలి రోజున పేర్చే బతుకమ్మని ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు.
ఎంగిలి పూల బతుకమ్మని అని ఎందుకు అంటారంటే
ఇవి కూడా చదవండి
బతుకమ్మని పెర్చేందుకు ఒక రోజు ముందే రకారకాల పువ్వులను సేకరించి.. వాటిని నీటిలో వేసి నిల్వ చేస్తారు. ఇలా ఒక రోజు నిద్ర చేసిన పువ్వులతో బతుకమ్మ మొదటి రోజున పేరుస్తారు. అందుకనే కొన్ని ప్రాంతాల్లో ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని .. కొన్ని ప్రాంతాలలో తిన్న తర్వాత బతుకమ్మను పిలుస్తారట. బతుకమ్మ అందమైన పూల సంబరం.
నైవేద్యంగా ఏమి సమర్పిస్తారంటే..
తొలిరోజున పేర్చిన బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ. ఈరోజున తులసి దళాలు, వక్కలనుతో పాటు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తి అయ్యాక తర్వాత ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోడవంతో మొదటి రోజు బతుకమ్మ పూర్తి అవుతుంది.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందంగా ముస్తాబవుతారు. మందారం, గుమ్మడి, గునుగు, బంతి, చామంతి, సీతమ్మ జడలు వంటి రకరకాల అందమైన పువ్వులతో బతుకమ్మలను పేర్చి.. ముందుగా ఇంట్లో పూజ చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం వాటిని ఊరిలో ఒక చోటకు చేర్చి ఆడిపాడి బతుకమ్మకి స్వాగతం చెబుతారు. ఇలా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు