ICICI: ఐసీఐసీఐ అదిరే ఆఫర్స్.. పండగ షాపింగ్‌పై రూ.50,000 వరకు డిస్కౌంట్

ICICI: ఐసీఐసీఐ అదిరే ఆఫర్స్.. పండగ షాపింగ్‌పై రూ.50,000 వరకు డిస్కౌంట్


పండుగ సీజన్‌ వేళ ఐసీఐసీఐ బ్యాంక్ తన వార్షిక ఫెస్టివ్ బొనాంజా ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా కస్టమర్లు వివిధ రకాల వస్తువులపై రూ.50,000 వరకు డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్లు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ట్రావెల్, కిరాణా, ఫర్నిచర్, డైనింగ్ వంటి అనేక రంగాలలో అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డ్‌లెస్ ఈఎంఐ, కన్స్యూమర్ ఫైనాన్స్ ద్వారా కస్టమర్లు ఈ ప్రయోజనాలను పొందవచ్చని బ్యాంక్ వెల్లడించింది. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ప్రముఖ బ్రాండ్స్‌తో భాగస్వామ్యం

ఈ ఆఫర్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఆపిల్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, వన్‌ప్లస్, మేక్‌మైట్రిప్, గోయిబిబో, యాత్ర, బ్లింకిట్, స్విగ్గీ, అజియో, డిస్ట్రిక్ట్, పెప్పర్‌ఫ్రై వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఐసీఐసీఐ కస్టమర్‌లు అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

ఏ వస్తువులపై ఎంత డిస్కౌంట్?

మొబైల్స్ – ఎలక్ట్రానిక్స్: ఐఫోన్ 17 కొనుగోలుపై రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, వన్‌ప్లస్‌పై రూ.5,000 వరకు తగ్గింపు, నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.15,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎల్‌జీ, హైయర్, పానసోనిక్ వంటి బ్రాండ్ల ఎలక్ట్రానిక్స్‌పై రూ.50,000 వరకు క్యాష్‌బ్యాక్/తగ్గింపులు ఉన్నాయి.

ఫ్యాషన్ – ప్రయాణం: టాటా క్లిక్‌లో 15శాతం డిస్కౌంట్, అజియోలో 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. మేక్‌మైట్రిప్, గోయిబిబో, యాత్ర, ఈజ్‌మైట్రిప్, ఇక్సిగో, పేటీఎం ఫ్లైట్స్‌లో విమానాలు, హోటళ్ళు, హాలిడే ప్యాకేజీలపై రూ.10,000 వరకు తగ్గింపు ఉంది.

కిరాణా, ఫర్నిచర్ – భోజనం: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. పెప్పర్‌ఫ్రై, లివ్‌స్పేస్, ది స్లీప్ కంపెనీపై 35శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. స్విగ్గీ, ఈజీడైనర్, బిర్యానీ బై ది కిలో, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.

బ్యాంక్ రుణాలపై ప్రత్యేక పండుగ ఆఫర్లు

ఈ పండుగ సీజన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలపై కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.

గృహ రుణం: జీతం పొందే కస్టమర్లకు కేవలం రూ.5,000 ప్రాసెసింగ్ ఫీజుతో లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 15 వరకు చెల్లుతుంది.

ఆటో లోన్: తక్షణ ఆటో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రూ.999 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

పర్సనల్ లోన్: ఈ రుణాలపై వడ్డీ రేట్లు 9.99శాతం నుండి ప్రారంభమవుతాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు చెల్లుతుంది.

సెక్యూరిటీలపై రుణం: రూ.20 లక్షల వరకు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కేవలం రూ.1,000. ఈ ఆఫర్ డిసెంబర్ 31వరకు చెల్లుబాటులో ఉంటుంది.

ఈ ఆఫర్ల గురించి ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా మాట్లాడుతూ.. “కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఈ ఫెస్టివ్ బొనాంజా ఆఫర్లను రూపొందించాం. ఈ ప్రయోజనాలను పొందడానికి కస్టమర్లు తమ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. అన్ని ఆఫర్లకు నిబంధనలు, షరతులు వర్తిస్తాయి,” అని తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *