Andhra News: ఏపీలో మరోచోట అరకు కాఫీని మైమరిపించే కాఫీ తోటలు.. ఎక్కడో తెలుసా?

Andhra News: ఏపీలో మరోచోట అరకు కాఫీని మైమరిపించే కాఫీ తోటలు.. ఎక్కడో తెలుసా?


పార్వతీపురం మన్యం జిల్లాలో కాపీ తోటలు విస్తారంగా సాగిస్తున్నారు. ప్రధానంగా పాచిపెంట మండలం శతాబీ, నిల్లనుమిడి, తంగ్లాం, గరిసిగుడ్డి తదితర గిరిశిఖర ప్రాంతాల్లో ఈ పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. అందుకు ఈ ప్రాంతం చల్లగా ఉండటమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కాఫీ సాగుకు అనుకూలమైన చల్లని వాతావరణం కావడంతో ఈ మన్యం ప్రాంతంలో కాఫీ సాగు విస్తీర్ణం ప్రారంభించారు గిరిజనులు. ఆ తరువాత కాఫీ సాగు క్రమేణా పెరుగుతూ వస్తుంది. మొదట 1908లో 30 ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ సాగు నేడు వందల ఎకరాలకు విస్తరించింది. అరకు కాఫీకి డిమాండ్ అధికంగా ఉండడంతో ఇక్కడి రైతులు కాఫీ తోటల సాగుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలో కాఫీ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాఫీ సాగు పై గిరిజనులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో ఇక్కడ మరో 300 ఎకరాల్లో కాఫీ తోటలు సాగు చేసేందుకు ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ప్రసుత్తం అది సాగు నారు దశలో ఉంది.

ఈ ఏడాది జనవరి 28న దీనిపై సంబందిత సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు జిల్లా ఉన్నతాధికారులు. ఈ క్రమంలో పలువురు శాస్త్రవేత్తలు, అధికారుల బృందం ఈ ప్రాంతంలో కాఫీ సాగును పరిశీలించారు. సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించేలా పలు సూచనలు అందించారు. సాధారణంగా కాఫీ సాగుకు చల్లని ప్రాంతంతో పాటు సాగు ప్రాంతం సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తు ఉండాలి. పాచిపెంట మండలంలోని శతాబ్ది నుంచి తంగ్లాం వరకు కాఫీ తోటలు సాగయ్యే భూములు సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తు ఉండడం అత్యంత అనుకూలమైన అంశంగా మారింది. ఇదే సమయంలో కాఫీ గింజల ధర కూడా కలిసొస్తుంది. ప్రస్తుతానికి కాఫీ గింజల ధర కేజీ నాలుగు వందల వరకు ఉంది. ఎకరా విస్తీర్ణంలో కాఫీ తోటల సాగులో ఎకరాకు వేలల్లో ఖర్చయితే ఆదాయం మాత్రం లక్ష వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ సాగు ప్రారంభం అయిన దగ్గర నుండి కేవలం మూడేళ్లలో దిగుబడి వస్తుంది.

నాల్గవ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో గింజల దిగుబడులు వస్తాయి. అదే సమయంలో ఎకరా తోటలో దిగుబడి బాగుంటే 220 కేజీల నుంచి 250 పేజీల వరకు కాఫీ గింజలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంతో రైతులకు ఇది మంచి ఆదాయ వనరుగా మారింది. ఎకరాన్నర పొలంలో కాఫీ తోటలు సాగు చేస్తే ఏడాదికి ఎనభై వేల నుంచి లక్షా ఇరవై వేల వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు మహిళలు.

అయితే కాఫీ గింజల విక్రయానికి అరకు, పాడేరు ప్రాంతాలకు వెళ్లి రావాల్సి వస్తుంది. పార్వతీపురం మన్యం ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తే తమకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఏదైనా ప్రభుత్వం మరింత దృష్టి సారించి కాఫీ సాగు పై దృష్టి సారిస్తే గిరిజన రైతులకు ఆదాయవనరులు చేకూరడంతో పాటు మన్యం కాఫీ కూడా అరకు కాఫీలా రాణించే అవకాశం మెండుగా కనిపిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *