పింఛన్‌ డబ్బు కోసం తల్లి దారుణ హత్య.. కన్న కొడుకే హంతకుడు!

పింఛన్‌ డబ్బు కోసం తల్లి దారుణ హత్య.. కన్న కొడుకే హంతకుడు!


పరిగి, సెప్టెంబర్‌ 20: ఆ తల్లికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేయడంతో కోడళ్లు.. మనవసంతానంతో ఆమె కాలక్షేపం చేస్తుంది. కొడుకులకు భారం కాకూడదని వచ్చే పించన్‌ డబ్బుతో జీవనం సాగిస్తుంది. కానీ మద్యానికి బానిసైన పెద్ద కొడుకు తల్లి పెన్షన్ డబ్బుపై కన్నేశాడు. ఈ విషయమై పలుమార్లు తల్లితో గొడవ కూడా పడ్డాడు. ఈ క్రమంలో తాజాగా మరోమారు గొడవ పడటంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు పించన్‌ డబ్బు కోసం కన్నతల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామానికి చెందిన మిట్టకోడూరు మల్లమ్మ (57)కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అంజయ్య గత కొంతకాలంగా మద్యం బానిసై డబ్బు కోసం తల్లితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా పింఛన్‌ డబ్బు కోసం తల్లి మల్లమ్మతో మరో మారు ఘర్షణ పడ్డాడు. ఈ గొడవ కాస్త చిరిగి.. చిరిగి.. తీవ్రరూపం దాల్చడంతో కోపంతో ఊగిపోయిన అంజయ్య కర్రతో తల్లిపై దాడి చేశాడు. ఆనక గొడుగు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రక్తపు మడులో మల్లమ్మ పడి మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించానే.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు అంజయ్యను అదుపులోకి తీసుకున్నారు. మల్లమ్మ చిన్నకొడుకు మైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు అంజయ్యను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. తల్లి పింఛన్‌ డబ్బు కోసమే ఈ హత్య చేసినట్లు తెలిపాడు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *