Actor: ఇండస్ట్రీలో సంచలనం.. అభిమానుల ప్రాణం అతడు.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టగలరా.. ?

Actor: ఇండస్ట్రీలో సంచలనం.. అభిమానుల ప్రాణం అతడు.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టగలరా.. ?


బాల్యం.. ప్రతి ఒక్కరికి మధుర జ్ఞాపకం. చిన్నప్పటి జీవితం అందరికి గుర్తుండిపోయే అద్భుతమైన సమయం. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. మరోవైపు తమకు ఇష్టమైన స్టార్స్ బాల్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ టాలీవుడ్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులోని అబ్బాయిలలో ఓస్టార్ హీరో ఉన్నాడు. అతడి పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఇక సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో జాతరే. ఈ హీరో అంటే అభిమానులకు ప్రాణం. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో కనిపిస్తున్న ఐదుగురు అబ్బాయిల్లో ఓ స్టా్ర్ హీరో ఉన్నాడు. అతడు ఇండస్ట్రీలో సంచలనం. ఇప్పుడు రాజకీయాల్లో సునామి. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? అందులో ఉన్న హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన పవన్.. ఆ తర్వాత బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తమ్ముడు, తొలి ప్రేమ సినిమాలతో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. లవ్ స్టోరీ, మాస్ యాక్షన్ డ్రామాలతో అన్ని వర్గాల అడియన్స్ ను ఆకట్టుకున్నారు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు తన సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే హరి హర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన పవన్.. ఇప్పుడు ఓజీ చిత్రంతో రాబోతున్నారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఓజీ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *