ఒత్తైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు.. కానీ అలాంటి జుట్టు కోసం రోజూ షాంపూ చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. షాంపూలలోని రసాయనాలు జుట్టుకు హాని కలిగించే అవకాశం ఉంది. అయితే వారానికి ఎన్నిసార్లు షాంపూ చేయాలి అనేదానికి సమాధానం మీ జుట్టు రకం, వయసు, మీరు నివసించే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. మీ జుట్టు సంరక్షణకు సంబంధించి కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
రోజూ జుట్టు కడగడం మంచిదేనా?
రోజూ జుట్టు కడగడం వల్ల తల శుభ్రంగా అనిపించినప్పటికీ గిరజాల జుట్టు ఉన్నవారు అలా చేయడం వల్ల జుట్టు దెబ్బతిని, పొడిబారి, రాలిపోయే అవకాశం ఉంది. జిడ్డుగల జుట్టు ఉన్నవారు మాత్రం ప్రతి రెండు రోజులకు ఒకసారి జుట్టు కడుక్కోవచ్చు.
మీ జుట్టు రకాన్ని బట్టి షాంపూ..
సన్నని జుట్టు: సన్నని జుట్టు ఉన్నవారు ప్రతి రెండు రోజులకు ఒకసారి షాంపూ చేయవచ్చు.
మీడియం-మందపాటి జుట్టు: ఈ రకమైన జుట్టు ఉన్నవారు వారానికి రెండు నుంచి నాలుగు సార్లు షాంపూ పెట్టుకోవచ్చు.
మందపాటి, గిరజాల జుట్టు: ఈ జుట్టు త్వరగా పొడిబారుతుంది కాబట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే కడిగితే మంచిది.
షాంపూ ఎక్కువగా వాడటం వల్ల కలిగే నష్టాలు
- జుట్టు పొడిబారడం
- చిట్లిన చివర్లు రావడం
- జుట్టు ఎక్కువగా రాలడం
షాంపూ లేకుండా జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ఎలా?
డ్రై షాంపూ: ఇది తలపై ఉండే అదనపు నూనె, మురికిని తొలగిస్తుంది. అయితే దీన్ని సాధారణ షాంపూకి బదులుగా వాడకూడదు.
స్టైలింగ్ ఉత్పత్తులు తగ్గించండి: జెల్లు, హెయిర్ స్ప్రేలు ఎక్కువగా వాడటం వల్ల తలపై జుట్టు పేరుకుపోయి, జిడ్డుగా మారుతుంది. అలాంటివారు వారానికి ఒకసారి తల చర్మాన్ని పూర్తిగా శుభ్రపరిచే షాంపూని వాడవచ్చు.
కుదుళ్లకు మాత్రమే షాంపూ: జుట్టు మొత్తం షాంపూతో కడిగే బదులు కుదుళ్లకు మాత్రమే షాంపూ అప్లై చేయండి. ఇది తలలోని చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అదే సమయంలో జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది.
మీరు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకుంటే అది అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టుకు సరిపోయే షాంపూను ఎంచుకోవడం, సరైన పద్ధతిలో శుభ్రం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.