Yashasvi Jaiswal : ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్కు చోటు దక్కలేదు. అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను తీసుకున్నారు. దీనిపై జైస్వాల్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. జట్టులో లేకపోయినా, జైస్వాల్ తన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
మషబుల్ ఇండియాతో మాట్లాడిన జైస్వాల్, ‘నేను దాని గురించి పెద్దగా ఆలోచించను. ఇది సెలెక్టర్ల చేతిలో ఉంటుంది. జట్టు కాంబినేషన్ బట్టి వారు నిర్ణయం తీసుకుంటారు. నేను నా వంతుగా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’ అని అన్నారు.
జైస్వాల్ ఫామ్ ఎలా ఉంది?
యశస్వి జైస్వాల్ ఇటీవల చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్‌లలో 43 సగటుతో, 159.71 స్ట్రైక్ రేట్‌తో 559 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా అతను 411 పరుగులు చేసి, రెండు సెంచరీలు నమోదు చేశాడు.
Jaiswal on not being selected for Asia cup pic.twitter.com/gFiMo9Nrti
— खटाना भाई (@CricwormAnna) September 19, 2025
రోహిత్, కోహ్లీ గురించి జైస్వాల్ ఏమన్నాడు?
జట్టులో చోటు దక్కకపోయినా, జైస్వాల్ తన సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. రోహిత్ శర్మ తనకు ఒక గురువులాంటి వారని ఆటలో, మానసికంగా తనను మెరుగుపరచడంలో చాలా సహాయం చేశారని చెప్పాడు. ‘రోహిత్ భాయ్‌తో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన చాలా విషయాలు నేర్పించారు. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయనతో మాట్లాడితేనే చాలా నేర్చుకోవచ్చు’ అని జైస్వాల్ చెప్పాడు.
అలాగే, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కోహ్లీ ఎంత సరదాగా ఉంటాడో చెప్పాడు. ‘పాజీ అద్భుతమైన వ్యక్తి, చాలా స్ట్రాంగ్. నేను ఆయనతో చాలాసార్లు బ్యాటింగ్ చేశాను. ఆయన చాలా ఫన్నీగా ఉంటారు. ఆయనతో సమయం గడిపితే నవ్వుతూనే ఉంటారు. ఆయన ఏదైనా ఒక విషయం చెబితే, దానిని పూర్తిగా వివరించి చెబుతారు. ఆయన చాలా తెలివైనవారు. ఎవరైనా ఏదైనా ఫన్నీగా చెప్పాలంటే కష్టంగా ఉంటుంది, కానీ ఆయన చెబితే మాత్రం 100 శాతం నవ్వు ఆపుకోలేం’ అని జైస్వాల్ చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..