Akhanda 2 Tandavam: అఖండ 2 నుంచి క్రేజీ అప్డేట్.. 600 మంది డాన్సర్లతో అదిరిపోయే మాస్ సాంగ్.. ఇక రచ్చే..

Akhanda 2 Tandavam: అఖండ 2 నుంచి క్రేజీ అప్డేట్.. 600 మంది డాన్సర్లతో అదిరిపోయే మాస్ సాంగ్.. ఇక రచ్చే..


‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’తో రాబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో అదిరిపోయే మాస్ డాన్స్ నంబర్‌ను షూట్ చేస్తున్నారు. 600 మంది డాన్సర్లతో ఈ పాటను చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. అఖండలో ‘జై బాలయ్య’ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్, ఇప్పుడు ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

తమన్ అద్భుతమైన మాస్ నెంబర్ కంపోజ్ చేశారు. బాలయ్య మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతున్నారు. ఈ పాట థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉండబోతోంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. నందమూరి బాలకృష్ణను మునుపెన్నడూ లేని విధంగా ఫెరోషియస్ అవతారంలో కనిపిస్తూ అభిమానులని ప్రేక్షకులని కట్టిపడేశారు.

ఇవి కూడా చదవండి

Image

3 ఏళ్లుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మూవీ..

Image

తెలుగులో ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

Image

ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్..

Image

ఒకప్పుడు సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లు…

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆమె కూడా స్టోరీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం అద్భుతమైన టెక్నికల్‌ టీం పని చేస్తోంది. ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, సి. రాంప్రసాద్ డీవోపీగా వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్‌ను తమ్మిరాజు నిర్వహిస్తుండగా, ఏఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *