Tollywood: ఈ పహిల్వాన్‌ను గుర్తు పట్టారా? స్టాండప్ కమెడియన్ టు స్టార్ యాక్టర్.. 46 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి..

Tollywood: ఈ పహిల్వాన్‌ను గుర్తు పట్టారా? స్టాండప్ కమెడియన్ టు స్టార్ యాక్టర్.. 46 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి..


Tollywood: ఈ పహిల్వాన్‌ను గుర్తు పట్టారా? స్టాండప్ కమెడియన్ టు స్టార్ యాక్టర్.. 46 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి..

పై ఫొటోలో మెలితిరిగిన కండలు చూపిస్తూ పోజులిస్తోన్న దెవరో గుర్తు పట్టారా? సుమారు 80కు పైగా సినిమాలు.. స్టార్ హీరోలతో స్క్రీన్ షేరింగ్.. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే ట్యాలెంట్.. ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు.. ఇలా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ నటుడు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ పై ఆసక్తి ఉండడంతో స్టేజ్ షోస్ లో మైఖెల్ జాక్సన్ లా స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.1997 లో సినిమా ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పటివరకు సుమారు 80 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. విశాల్, అజిత్, ధనుష్ ,సూర్య, దళపతి విజయ్, విక్రమ్.. ఇలా స్టార్ హీరోలందరి సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. గత రెండున్నర దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన ఈ స్టార్ కమెడియన్ మొన్నటివరకు మన మధ్యనే ఉన్నాడు. కానీ గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి సడెన్ గా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. దీంతో నటుడి కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తీవ్ర అనారోగ్యంతో 46 ఏళ్లకే కన్నుమూసిన ఆ కమెడియన్ మరెవరో కాదు రోబో శంకర్.

 

గత కొన్ని రోజులుగా కామెర్లతో బాధపడుతున్న రోబో శంకర్ ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా తగ్గించారు. అదే సమయంలో ఆయన అనూహ్యంగా బరువు తగ్గడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రోబో శంకర్ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో చిత్ర బృందం వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో రెండు రోజులుగా చికిత్స పొందుతోన్న రోబో శంకర్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచాడు. జీర్ణాశయంలో తీవ్ర రక్తస్రావం, అంతర్గతంగా అవయవాలు చెడిపోవడంతోనే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

రోబో శంకర్ కు భార్య, కుమార్తె ఉన్నారు. జయ్‌ బిగిల్‌ చిత్రంలో ‘గుండమ్మ’గా అలరించిన నటి ఇంద్రజ ఈయన కూతురే. గతేడాది ఇంద్రజా శంకర్ కు ఘనంగా వివాహం జరిపించాడీ స్టార్ కమెడియన్. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

రోబో శంకర్ కూతురును ఓదారుస్తోన్న హీరో ధనుష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *