Quicklly: అమెరికాలో ఇండియన్ రుచులు.. క్విక్లీ ప్రమోటర్లుగా రకుల్ – జాకీ..

Quicklly: అమెరికాలో ఇండియన్ రుచులు.. క్విక్లీ ప్రమోటర్లుగా రకుల్ – జాకీ..


అమెరికాలోని అతిపెద్ద భారతీయ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అయిన క్విక్లీ, బాలీవుడ్ ప్రముఖులు రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానితో జత కట్టింది. ఈ యువ జంట ఇప్పుడు క్విక్లీ బ్రాండ్ ప్రమోటర్లుగా వ్యవహరించనున్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా క్విక్లీ భారతీయ కిరాణా సరుకులు, స్వీట్స్, రెడీ-టు-ఈట్ ఫుడ్స్, ఇండియన్ మీల్ కిట్స్‌ వంటి ఉత్పత్తులను భారత్, అమెరికాలో మరింత విస్తృతంగా ప్రజలకు అందించనుంది.

ఇంటి రుచులను ఆస్వాదిద్దాం – రకుల్

ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. “మేము అమెరికాలో ఉన్నప్పుడు ఇంటి వంటలు చాలా మిస్ అవుతాం. భోజనం అనేది కేవలం ఆహారం కాదు.. అది ఒక సంస్కృతి, జ్ఞాపకం. క్విక్లీ మన దేశీ సంప్రదాయాలను సజీవంగా ఉంచుతుంది. మన ప్రజలకు ఇంటి అనుభూతిని కలిగిస్తుంది. క్విక్లీ కుటుంబంలో భాగం కావడం మాకు గర్వంగా ఉంది” అని అన్నారు.

స్థానిక వ్యాపారాలకు మద్దతు – జాకీ భగ్నాని

జాకీ భగ్నాని మాట్లాడుతూ.. “క్విక్లీ కేవలం ఒక మార్కెట్‌ప్లేస్ మాత్రమే కాదు.. ఇది ఇంటి జ్ఞాపకాలను అందిస్తుంది. వారు అమెరికాలోని స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించి.. వాటికి తగిన గుర్తింపు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తారు. భారతీయ కిరాణా, ఫుడ్స్, ఇతర సాంస్కృతిక ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తెచ్చే ఈ ప్రయాణంలో భాగం కావడం మాకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.

సంస్థ లక్ష్యం ఇదే..

క్విక్లీ సహ-స్థాపకులు హనిష్ పహ్వా, కేవల్ రాజ్ మాట్లాడుతూ.. “రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానిని క్విక్లీ కుటుంబంలోకి స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యం, ప్రామాణికత పట్ల వారి నిబద్ధత.. మా లక్ష్యానికి సరిగ్గా సరిపోతుంది. మా ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, ప్రధానంగా అమెరికాలో ఉన్న వారు, భారతీయ కిరాణా నుండి రెడీ-టు-ఈట్ ఫుడ్స్, స్నాక్స్ వరకు అన్ని ప్రామాణికమైన భారతీయ ఉత్పత్తులను సులభంగా పొందడంలో వారు స్ఫూర్తినిస్తారని నమ్ముతున్నాం” అని చెప్పారు.

క్విక్లీ గురించి..

క్విక్లీ అనేది అమెరికా, కెనడాలో నంబర్ 1 భారతీయ సూపర్ యాప్. ఇది భారతీయ కిరాణా సరుకులు, ఫుడ్స్, ఇతర సాంస్కృతిక ఉత్పత్తులను అందించే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్. “ఘర్ జైసా ప్యార్” అనే నినాదంతో దేశ ప్రజలకు ఇంటి నుండి అవసరమైన ప్రతిదాన్ని ఇంటి వద్దకే డెలివరీ చేయడమే ఈ సంస్థ లక్ష్యం. క్విక్లీ దేశవ్యాప్తంగా 10,000కు పైగా ఉత్పత్తులను డెలివరీ చేస్తుంది. చికాగో, న్యూయార్క్, న్యూజెర్సీ, బే ఏరియా వంటి ప్రాంతాలలో అదే రోజు డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. క్విక్లీ స్థానిక వ్యాపారాలను తమ ఇన్-హౌస్ బ్రాండ్ ‘జస్ట్ బై క్విక్లీ’తో అనుసంధానం చేస్తూ పూర్తిస్థాయి సేవలను అందిస్తోంది. మరింత సమాచారం కోసం https://www.quicklly.com/ ను సందర్శించవచ్చు.

బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *