అమరావతి, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ జారీ చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు సమయంలో పొరపాటున తప్పుడు సమాచారం నింపామంటూ కొందరు అభ్యర్ధులు మెయిల్స్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసు నియామక మండలి (AP SLPRB) ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా.. అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు సెప్టెంబరు 22వ తేదీ వరకూ దరఖాస్తుల్లో సవరణలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.
అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో కులం, పుట్టిన తేదీ, పరీక్ష రాసే స్థలం, ఫోటో, సంతకం, లోకల్/నాన్‌లోకల్ విభాగాల్లో ఏవైనా వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటే.. ఆ సమాచారాన్ని సవరణ చేసుకోవచ్చని, అటువంటి వారు సంబంధిత పత్రాలతో ఈ మెయిన్‌కు mail-slprb@ap.gov.in పంపించాలని సూచించారు. కాగా మొత్తం 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు పోలీస్ నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆగస్ట్ 11 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించింది. రాత పరీక్ష అక్టోబర్ 5, 2025వ తేదీన నిర్వహించనుంది.
ఏపీ ఈఏపీసెట్ 2025 తుది విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET) 2025 చివరి విడుత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో సీట్ల కేటాయింపు ఫలితాలను పొందుపరిచింది. అభ్యర్థులు సెప్టెంబర్ 23లోపు సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. బీఫార్మసి, ఫార్మ్‌డీ కోర్సుల కౌన్సెలింగ్ తేదీలను త్వరలో విడుదల చేయనుంది.
ఇవి కూడా చదవండి
ఏపీ ఈఏపీసెట్ 2025 తుది విడత సీట్ల కేటాయింపు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.