నవరాత్రి ఉపవాసాల సమయంలో చాలామందికి సాయంత్రం వేళల్లో ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది. అదే సమయంలో రుచి, ఆరోగ్యంతో పాటు ఉపవాసానికి సరిపోయేలా ఉండే స్నాక్ ను ఎంచుకోవడం కష్టం. అయితే, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకు సగ్గుబియ్యం టిక్కీ ఒక అద్భుతమైన ఎంపిక.
కావాల్సిన పదార్థాలు:
పెద్ద బంగాళాదుంప: 1
సగ్గుబియ్యం: ½ కప్పు
జీలకర్ర పొడి: ½ టీస్పూన్
తరిగిన పచ్చిమిర్చి: ½ టీస్పూన్
రాక్ సాల్ట్: 1 టేబుల్ స్పూన్
వేరుశెనగ నూనె: 2-3 టేబుల్ స్పూన్లు
మామిడి పొడి: ¼ టీస్పూన్
వేయించడానికి సరిపడా నూనె
కొత్తిమీర ఆకులు: 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం:
సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసి 2-4 గంటల పాటు నానబెట్టాలి.
నానిన సగ్గుబియ్యంలో ఉడికించిన, తొక్క తీసిన బంగాళాదుంప కలపాలి.
ఈ మిశ్రమంలో మసాలా పొడులు, కొత్తిమీర ఆకులు, పచ్చిమిర్చి కలపాలి.
మిశ్రమాన్ని చిన్న టిక్కీలుగా చేసి పక్కన ఉంచాలి.
ఒక కడాయిలో నూనె వేడి చేయాలి. సగ్గుబియ్యం టిక్కీలను వేసి అవి క్రిస్పీగా మారే వరకు డీప్ ఫ్రై చేయాలి.
రుచికరమైన టిక్కీలను పుదీనా లేదా కొత్తిమీర చట్నీతో తినవచ్చు.