Actress Hema: మంచు విష్ణు ఏం చేస్తున్నారు? మా అసోసియేషన్‌పై విరుచుకుపడిన హేమ.. ఏం జరిగిందంటే?

Actress Hema: మంచు విష్ణు ఏం చేస్తున్నారు? మా అసోసియేషన్‌పై విరుచుకుపడిన హేమ.. ఏం జరిగిందంటే?


గత కొన్ని రోజులుగా సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు సీనియర్ నటి హేమ. అయితే శనివారం (సెప్టెంబర్ 20) ఆమె సడెన్ గా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు ప్రెసిడెంట్ మంచు విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మంచు విష్ణు మీరు ఏం చేస్తున్నారు? . గతం లో కూడా ఇలానే మహిళలపై మాట్లాడితే చర్యలు తీసుకోలేదు. దయ చేసి వెంటనే మీరు రియాక్ట్ అవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె వీడియో బైట్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. అసలు ఏం జరిగిందనే విషయంలోకి వెళితే.. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దక్ష. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ మంచు లక్ష్మి డ్రస్సింగ్ సెన్స్ గురించి అభ్యంతరకర ప్రశ్నలు అడిగారు. ’47 ఏళ్ల వయసున్న మహిళ, 12 ఏళ్ల కూతురున్న మహిళా ఇలాంటి దుస్తులు వేసుకోవడమేంటి? అని సమాజం కామెంట్స్ చేస్తుంది’ అంటూ మంచు లక్ష్మితో చెప్పారు. దీనిపై మంచు వారమ్మాయి కూడా ఘాటుగానే స్పందించింది. ఇదే ప్రశ్న మహేష్ బాబును అడగ గలరా?’ అంటూ అక్కడికక్కడే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత సదరు సీనియర్ జర్నలిస్ట్ పై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో ఫిర్యాదు కూడా చేసింది. అలాగే మా అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేసిందని సమాచారం.

తాజాగా ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది నటి హేమ. ‘మంచు లక్ష్మి పై మాట్లాడిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. గతం లో కూడా ఇలానే మహిళలపై మాట్లాడితే చర్యలు తీసుకోలేదు. విష్ణు బాబు ఏం చేస్తున్నారు? మీరు వెంటనే రియాక్ట్ అవ్వాలి’ అని డిమాండ్ చేసింది. ఇదే సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులపై కూడా ఘాటు విమర్శలు చేసింది హేమ. గత కొన్ని నెలలుగా తాను మూడు రాష్ట్రాల మీడియా ప్రతినిధులతో పెద్ద యుద్ధమే చేస్తున్నానంటూ పేర్కొంది. మరి ఈ వీడియోపై మా అసోసియేషన్ స్పందిస్తుందా? మంచు విష్ణు ఎలాంటి చర్యలు తీసుకుంటాడన్నది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

నటి హేమ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *