Viral Video: వామ్మో.. వాయ్యో.. నీకు దండం పెడతా వదిలేయరాదే… ఎలుక చేసిన పనికి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్న నెటిజన్స్‌

Viral Video: వామ్మో.. వాయ్యో.. నీకు దండం పెడతా వదిలేయరాదే… ఎలుక చేసిన పనికి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్న నెటిజన్స్‌


సాధారణంగా పాము, ముంగీస మధ్య వైరం ఉటుందంటారు. అవి రెండు ఎదురు పడితే భీకర యుద్ధమే. ఇక ముంగీసను పోలిన ఎలు కనిపిస్తే మాత్రం పాముకు పండకే. అమాంతం గుటుక్కుమనే దాకా ఒదిలిపెట్టదు పాము. అయితే ఇక్కడో ఎలుక మాత్రం ముంగీసను మించిపోయింది. పాములు, ఎలుకలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌ అవుతుంటాయి. అయితే పాము నోటికి చిక్కిన ఎలుక ప్రాణాలతో బయటపడటం మాత్రం అసంభవం. అలాంటి ఓ ఎలుక పాము నోటికి చిక్కకుండా తప్పించుకున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

వీడియోలో ఎదురుగా ఉన్న ఓ ఎలుకను ఓ పాము కాటేయాలని చూస్తుంది. అదేమో దొరకకుండా తప్పించుకుంటుంది. ఈ క్రమంలో పాముకు కోపం కట్టలు తెంచుకుంటుంది. అమాంతం మింగబోతుంది. అయినా దాని నోటికి చిక్కదు ఆ ఎలక. అ ఎలక బోనులో ఉండటమే దానికి శ్రీరామ రక్ష అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

బోనులో చిక్కకుని ఉన్న ఎలుక వద్దకు ఓ పాము వచ్చింది. ఎలుకను చూసి అబ్బ భలే దొరికింది అనుకుని దాని దగ్గరికి వెళ్లింది. ఎలుక బోనులో ఉన్న విషయం పాముకు అర్థం కాక పదేపదే కాటేయడానికి ప్రయత్నించింది. అయితే ఇనుప ఊచల చాటున ఉన్న ఎలక పామును నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం ఈ వీడియోలో భలే తమాషాగా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఎలుకను ఇవ్వాళ కాటేయనిదే వదిలేదే లేదు అన్నట్లుగా పాము పదేపదే ప్రయత్నిస్తుంది. పాము ప్రయత్నించిన ప్రతీసారీ లోపల ఉన్న ఎలుక ఎంతో తెలివిగా అటు ఇటు పరిగెడుతూ పాము కోరలకు అందకుండా తప్పించుకుంటుంది. ఈ సమయంలో ఎలుక ఎక్స్‌ప్రెషన్స్‌ పాముకు మరింత చికాకు తెప్పించేదిగా ఉంటుంది. ఆ పాము ఎన్నిసార్లు కాటేయడానికి ప్రయత్నించినా ఎలుక ఎంటిక కూడా ఊడలేదు.

వీడియో చూడండి:

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘ట్రాప్‌‌లో పడడమే ఈ ఎలుక అదృష్టమైంది’.. అంటూ నెటిజన్స్‌ పోస్టులు పెడుతన్నారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *