Hardik Pandya : ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సంజూ శాంసన్‌కు లభించినప్పటికీ, మరో ఆటగాడు మాత్రం ఒక ప్రత్యేకమైన మెడల్‌ను గెలుచుకున్నాడు. అతడే మన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. పాకిస్తాన్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యాకు ఈ గౌరవం ఎందుకు లభించిందో తెలుసుకుందాం.
ఆసియా కప్ 2025లో ఒమన్ పై విజయం సాధించిన తర్వాత భారత జట్టు ఇప్పుడు సూపర్-4లో పాకిస్తాన్‌తో తలపడబోతోంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక ప్రత్యేకమైన అవార్డును గెలుచుకున్నాడు. అతను ‘సబ్‌కీ షాన్, సబ్‌కా మాన్’ అనే గౌరవాన్ని పొందడమే కాకుండా, ఒక మెడల్‌ను కూడా గెలుచుకున్నాడు.
డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగింది?
ఒమన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత భారత డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో తెలుపుతూ బీసీసీఐ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో హార్దిక్ పాండ్యాకు ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మెడల్ లభించింది. ఈ మెడల్‌ను భారత జట్టు ట్రైనింగ్ అసిస్టెంట్ అయిన దయానంద్ గరానీ అందించారు.
దయానంద్‌ను ఈ పని కోసం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎంచుకున్నారు. దయానంద్ మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్‌కు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాను పరిచయం చేస్తూ సబ్‌కీ షాన్, సబ్‌కా మాన్ అంటూ పొగిడాడు. ఈ గౌరవాన్ని అందుకున్న తర్వాత హార్దిక్ కూడా ఆ మెడల్‌ను దయానంద్ మెడలో వేసి, గౌరవించాడు.
హార్దిక్ ఏం చేశాడు?
ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చేసిన ప్రదర్శన అంత గొప్పగా లేదని చాలామంది అనుకున్నారు. బ్యాటింగ్‌లో కేవలం 1 పరుగు చేసి రనౌట్ అయ్యాడు. కానీ, అతని బౌలింగ్ మరియు ఫీల్డింగ్‌తో మ్యాచ్‌పై చాలా ప్రభావం చూపాడు.
A clinical performance by #TeamIndia against Oman and we now head into the Super 4 stage.
A recap of our win and some encouraging words from our dressing room Player of the Match 👏👏
Find out more here 👇👇#AsiaCup2025https://t.co/Lj7rLReYoW
— BCCI (@BCCI) September 20, 2025
హార్దిక్ పాండ్యా తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అతని ఎకానమీ రేట్ 6.50 గా ఉంది, ఇది టీమిండియా బౌలర్లలో అత్యుత్తమం. అలాగే, ఫీల్డింగ్‌లో అతను ఓపెనర్ అమీర్ కలీమ్ (64 పరుగులు) కొట్టిన బంతిని అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ చేశాడు. ఈ క్యాచ్ మ్యాచ్ గమనాన్ని మార్చివేసింది. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగానే హార్దిక్‌కు ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..