బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న “ఫౌజీ” అనే చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇండిపెడెన్స్ రావడానికి ముందు జరిగిన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని “సీతారామం” చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న అభిషేక్ బచ్చన్, తొలిసారిగా దక్షిణాది చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న మంచి సంబంధం ఈ కలయికకు కారణం కావచ్చునని అంటున్నారు. “ఫౌజీ” చిత్రబృందం అభిషేక్ బచ్చన్‌తో చర్చలు జరిపిందని, కథ నచ్చి ఆయన నటించడానికి అంగీకరించాడని సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :