ఈ కంకణాన్ని బంగారంతో తయారుచేశారు. మ్యూజియంకు చెందిన పునరుద్ధరణ లేబొరేటరీలో ఉంచగా ఆ తర్వాత అది కనిపించకుండాపోయింది. దీనిని దొంగలించిన వ్యక్తులు విదేశాలకు అక్రమ రవాణా చేయొచ్చని ఈజిప్ట్ ప్రభుత్వం అనుమానించింది. వెంటనే దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దుల వద్ద తనిఖీలు చేసింది. బ్రేస్లెట్ ఫొటోను ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్‌లో షేర్ చేసింది. ఈజిప్ట్‌ను పాలించిన అమేనీమోప్ రాజుకు చెందిన కంకణంగా దీనిని గుర్తించారు. ఆ కాలంలో అత్యంత శక్తివంతమైన రాజుగా అమేనీమోప్ వెలుగొందారు. అమేనీమోప్ సమాధిని 1940లో కనుగొన్నారు. 3 వేల ఏళ్ల చరిత్ర గల ఇలాంటి కంకణం చోరీకి గురి కావడం వింతేమీ కాదు. ఉత్తర ఆఫ్రికా దేశమైన ఈజిప్ట్‌కు దశాబ్దాలుగా పురాతన వస్తువుల స్మగ్లింగ్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. శక్తిమేరకు కాపాడుతున్నా ప్రతి ఏటా ఎక్కడో ఓ చోట ఇలా విలువైన వస్తువులు అదృశ్యమవుతూనే ఉన్నాయి. బ్రేస్‌లెట్‌ను కరిగించే అవకాశం చాలా తక్కువ. కరిగిస్తే వచ్చే బంగారం విలువ కన్నా అలాగే కంకణం రూపంలోనే అమ్మి లెక్కలేనంత సొమ్ము సంపాదిస్తారు స్మగ్లర్లు. వీటికి బహిరంగ మార్కెట్లో చాలా విలువ ఉంది. స్మగ్లర్లు వీటిని విదేశాలకు తరలిస్తారు. అది ఎక్కడో, ఏ దేశంలోనో ప్రఖ్యాత వేలం సంస్థ వేలంపాటలోనో ఆన్లైన్లోనో ప్రత్యక్షమవుతుంది.
మరిన్ని వీడియోల కోసం :