కిడ్నీ రోగులు: మఖానాలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎక్కువ పోటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. ఒక వేళ ఎక్కు పోటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకుంటే హార్ట్బీట్పై ప్రభావం చూపుతుంది. ఆలాగే ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా వస్తాయి.
డయాబెటిక్ రోగులు: మఖానాను తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా పరిగణిస్తున్నప్పటికీ, దీన్ని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్‌లో మార్పులు వస్తాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు వీటిని వైద్యులు చెప్పినన మోతాదులోనే తీసుకోండి, లేదంటే వాటికి ఆల్టర్నేట్గా ఉండే ఫుడ్‌ను తినండి.
జీర్ణ సమస్యలు ఉన్నవారు: జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మఖానాకు దూరంగా ఉండండి. మఖానాలోని ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల అపానవాయువు, గ్యాస్, మలబద్ధకం సమస్యలు పెరుగుతాయి.జీర్ణవ్యవస్ బలహీనంగా ఉన్నవారు వీటిని ఎక్కువగా తింటే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
అలెర్జీ బారినపడే వ్యక్తులు: కొంతమందికి కొన్ని ఫుడ్స్ తింటే అలెర్జీ వస్తుంది. కాబట్టి మఖానా అంటే అలెర్జీ ఉన్న వారు వీటికి దూరంగా ఉండండి. వీటిని తిన్నప్పుడు మీరు దురద, దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటే మీరు వెంటనే దానిని తినడం మానేయాలి.
బరువు తగ్గాలనుకునేవారు: కొందరు మఖానాను స్నాక్స్‌గా చేసుకొని తింటారు. అలాంటప్పుడు దాన్ని వేయించి, దానికి నెయ్యి, నూనె లేదా సుగంధ ద్రవ్యాలు కలిపి స్నాక్‌ను రెడీ చేస్తారు. ఇలా చేయడం ద్వారా వాటిలోకి అదనపు కొవ్వు, కేలరీలు చేరుతాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తనడం వల్ల ఇంకా బరువు పెరగడానికి దారితీస్తాయి.( NOTE మఖానా నిస్సందేహంగా పోషకమైన ఆహారం, కానీ అన్ని ఆహారాల మాదిరిగానే దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అందువల్ల, ఎవరికైనా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, వారు మఖానాను క్రమం తప్పకుండా తినే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి)