ఏ సీజన్ అయినా సరే వంటగదిలోని వస్తువులను సరిగ్గా నిల్వ చేయకపోతే.. అవి త్వరగా చెడిపోతాయి. ఎంత ఖరీదు పెట్టి కొన్నా సరే ఆ వస్తువులను పారవేయాల్సి ఉంటుంది. అప్పుడు అయ్యో అని ఫీల్ అవుతాం. ఇలా పాడయ్యే వస్తువుల్లో బెల్లం ఒకటి. బెల్లం ఒక సాధారణ వినియోగ వస్తువు. చాలా మంది దీనిని చక్కెర స్థానంలో ఉపయోగిస్తారు. బెల్లం రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఒక నిధి. బెల్లం సరిగ్గా నిల్వ చేయకపోతే.. తేమ దానిని చెడిపోయేలా చేస్తుంది. అపుడు ఆ బెల్లం మళ్ళీ ఉపయోగించలేనిదిగా మారుతుంది. ఈ నేపధ్యంలో కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సీజన్ లో బెల్లంను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. కనుక ఈ రోజు కొన్ని సులభమైన చిట్కాలను గురించి తెలుసుకుందాం..
చల్లని, పొడి ప్రదేశంలో… బెల్లం నిల్వ చేయాలంటే ముందు తేమ లేని ప్రదేశాన్ని ఎంచుకోండి. తేమ నుంచి బెల్లాన్ని దూరంగా ఉంచండి. ఎందుకంటే బెల్లానికి తేమ తగిలితే అది త్వరగా చెడిపోతుంది. కనుక బెల్లాన్ని దానిని నిల్వ చేయాలంటే చల్లని, పొడి ప్రదేశాన్ని ఎంచుకోండి.
బే ఆకులను వాడండి: బెల్లం చెడిపోకుండా ఉండటానికి బిర్యానీ ఆకులను వాడండి. మీరు బెల్లం వేసే కంటైనర్లో బే ఆకులను జోడించవచ్చు. బెల్లం నిల్వ చేస్తున్న కంటైనర్ అడుగున బే ఆకుని వేసి గిన్నెను ఉంచండి.. తరువాత బెల్లం వేసి గిన్నెను పైన ఉంచండి.
ఇవి కూడా చదవండి
చిన్న ముక్కలుగా కట్ చేసి నిల్వ చేసుకోండి: బెల్లంను చిన్న ముక్కలుగా కోసి నిల్వ చేసుకోండి. పెద్ద ముక్కలుగా నిల్వ చేయడానికి బదులుగా.. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బెల్లంలో తేమ తగ్గుతుంది. ఉపయోగించుకోవడానికి కూడా సులభం.
రిఫ్రిజిరేటర్లో బెల్లం నిల్వ: చాలా మంది ప్లాస్టిక్ డబ్బాల్లో బెల్లాన్ని నిల్వ చేస్తారు. అయితే బెల్లాన్ని స్టీల్ డబ్బాలో నిల్వ చేయాలి. ఇలా చేయడం వలన బెల్లం రంగు మారదు. ప్లాస్టిక్ డబ్బాలో బెల్లం పెడితే త్వరగా పాడైపోతుంది. రంగు మారుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)