Mohan Lal: థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మోహన్ లాల్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Mohan Lal: థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మోహన్ లాల్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..


మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు మిగతా భాషలలోని యంగ్ స్టార్స్ సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవలే హృదయపూర్వం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. క్లాసిక్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అయిన సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆశీర్వాద్ సినిమా బ్యానర్ పై ఆంటొని పెరుంబవూర్ నిర్మించగా.. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే మంచి వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఇవి కూడా చదవండి

Image

3 ఏళ్లుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మూవీ..

Image

తెలుగులో ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

Image

ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్..

Image

ఒకప్పుడు సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లు…

ఇదిలా ఉంటే.. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. థియేటర్లలో విడుదలై మూడు వారాలు దాటిపోవడంతో ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో సెప్టెంబర్ 26 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారట. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కించగా.. దాదాపు 70 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఈ ఏడాది మొత్తం మూడు సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు మోహన్ లాల్. ఎల్ 2 : ఎంపురాన్ సినిమాతో దాదాపు 260 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. అలాగే తుడరమ్ మూవీతో రూ.230 కోట్లు.. ఇప్పుడు హృదయపూర్వం సినిమాకు రూ.70 కోట్లు వసూలు చేశారు.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *