హైదరాబాద్, సెప్టెంబర్ 20: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజిన్లలో దాదాపు 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దేశ వ్యాప్తంగా మొత్తం 1.2 కోట్ల మంది పోటీపడుతున్నారు. అయితే ఆర్ఆర్బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించిన సీబీబీ-1 పరీక్షల ఫలితాలను శుక్రవారం (సెప్టెంబర్ 19) విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2 పరీక్షకు అనుమతిస్తారు. అయితే తాజాగా స్టేజ్ 2 పరీక్షల పరీక్ష తేదీలను ఆర్ఆర్బీ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 13న ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుంది. పరీక్షకు సరిగ్గా 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేస్తుంది. ఇక పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
కాగా ఆర్ఆర్బీ దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో చేపట్టిన గ్రాడ్యుయేట్ పోస్టులకు 8,113 ఎంపికైన వారి రోల్ నంబర్లను జోన్ వారీగా వెబ్సైట్లో పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు తమ రోల్ నంబర్‌ను అందులో చెక్ చేసుకోవచ్చు. వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలను జూన్ 5 నుంచి 24వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించింది.

RRB NTPC 2025 Graduate CBT 2 Exam Date
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ- 1 కట్ఆఫ్ మార్కులు ఇవే..
- జనరల్ కేటగిరీ కట్ఆఫ్: 75.20418
- ఎస్సీ కేటగిరీ కట్ఆఫ్: 70.04126
- ఎస్టీ కేటగిరీ కట్ఆఫ్: 66.72102
- ఓబీసీ కేటగిరీ కట్ఆఫ్: 70.90418
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కట్ఆఫ్: 68.83621
- ఈఎస్ఎమ్ కేటగిరీ కట్ఆఫ్: 30.97707
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.