నగరంలో సేదతీరేందుకు ఉదయం సైకిల్‌పై బయలుదేరిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం మణికొండ మర్రిచెట్టు జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భాస్కర్ అనే వ్యక్తి తొక్కతున్న సైకిల్ టైరు రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ కవర్ గ్రిల్ల్స్ మధ్య ఇరుక్కుపోవడంతో కిందపడిపోయి గాయపడ్డాడు. ఈ విషయాన్ని సైక్లింగ్ కమ్యూనిటీ ఆఫ్ హైదరాబాద్ సభ్యుడు సంతోష్ సెల్వన్ ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేశారు.
Our fellow family member and brother from #CyclingCommunityOfHyderabad is hurt badly today due to such man holes and less scientific/practical for a commuter with a #Bicycle
Request for careful consideration into this matter because this can cause danger to #Pedestrians too… pic.twitter.com/vQidgenUjg
— Bicycle Mayor of Hyderabad (@sselvan) September 19, 2025
“మన సైక్లింగ్ కమ్యూనిటీ సోదరుడు మ్యాన్‌హోల్ కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. సైకిల్ ప్రయాణికులను పరిగణలోకి తీసుకోని ఇలాంటి డిజైన్లు ప్రమాదకరమని పదేపదే చెబుతున్నా.. సమస్య యథాతథంగానే ఉంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చాలా మంది పాదచారులు, సైకిల్ రైడర్లే ఉన్నప్పటికీ రోడ్లు మాత్రం మోటార్ వాహనాలకే అనుకూలంగా ఉన్నాయని సెల్వన్ విమర్శించారు. చాలా సార్లు మ్యాన్‌హెల్స్ తెరిచి వదిలేస్తురని.. ఇవి సైకిల్ రైడర్లకు మాత్రమే కాకుండా పాదచారులకూ ప్రమాదకరం మారయని తెలిపారు. ఈ అంశాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు వివరించారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
గత ఏప్రిల్‌లో మాదాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ సైక్లిస్ట్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నాడు. సైకిల్‌పై వెళ్తున్న సుధాంసు అనే యువకుడు మ్యాన్‌హోల్ గ్రిల్‌లో టైరు ఇరుక్కుపోవడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతని ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. మొత్తం 26 స్టిచ్‌లు కుట్లు పడ్డాయి. 15-20 రోజుల పాటు లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది.