భారతీయులకు ట్రంప్ డోర్లు క్లోజ్‌..! ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించిన మైక్రోసాఫ్ట్‌, మెటా..!

భారతీయులకు ట్రంప్ డోర్లు క్లోజ్‌..! ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించిన మైక్రోసాఫ్ట్‌, మెటా..!


భారతీయులకు ట్రంప్ డోర్లు క్లోజ్‌..! ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించిన మైక్రోసాఫ్ట్‌, మెటా..!

హెచ్‌-1బీ వీసాల అప్లికేషన్‌ ఫీజును అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ కోటి రూపాయలకు పెంచారు. ఈ క్రమంలో టెక్‌ కంపెనీలు అప్రమత్తం అయ్యాయి. తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేశాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు డెడ్‌లైన్‌ ముగిసేలోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ.. తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేశాయి. అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం.

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన H1-B, H4 వీసాలు కలిగి ఉన్న ఉద్యోగులను సెప్టెంబర్ 21 నాటికి అమెరికాకు తిరిగి రావాలని ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా ఆర్డర్ తర్వాత ఈ చర్యకు పూనుకుంది. ట్రంప్ ఆదేశం ప్రకారం, H1-B వీసా హోల్డర్లు సెప్టెంబర్ 21 నుండి అమలులోకి వచ్చేలా లక్ష డాలర్లు (సుమారు రూ. 88 లక్షలు) రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు, JP మోర్గాన్ కూడా తన H1-B వీసా హోల్డర్లను అమెరికాలోనే ఉండి అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని అభ్యర్థించారు.

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మెయిల్!

అమెరికా అధ్యక్షులు ట్రంప్ నుండి వచ్చిన కొత్త ఉత్తర్వు ప్రకారం H1-B వీసాదారులు అదనంగా సుమారు రూ. 88 లక్షల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, సెప్టెంబర్ 21 నాటికి అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు ఒక ఇమెయిల్ ద్వారా సూచించింది. ఈ ఉత్తర్వును పాటించడానికి, మైక్రోసాఫ్ట్ తన H1-B, H4 వీసాదారులు అమెరికాలోనే ఉండి, భవిష్యత్తు నిర్ణయం వచ్చే వరకు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేసింది.

మెటా ఉద్యోగులకు అడ్వైజరీ జారీ

ఇక, జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని టెక్‌ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం రెండు వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికీ వెళ్లొద్దని సూచించింది. ఇతర దేశాల్లో ఉన్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు 24 గంటల్లోపు తిరిగి అమెరికాకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.

H1-B మరియు H4 వీసా అంటే ఏమిటి?

H-1B వీసా అనేది వలసేతర వీసా. ఇది ఉన్నత స్థాయి నైపుణ్యాలు (STEM, IT మొదలైనవి) కలిగిన విదేశీ నిపుణులను అమెరికాలో పని చేయడానికి అనుమతిస్తుంది. ఈ వీసా 3 సంవత్సరాలు చెల్లుబాలు అవుతుంది. యజమానిచే స్పాన్సర్ చేయడం జరుగుతుంది. H-4 వీసా H-1B వీసాదారుడి కుటుంబ సభ్యులు (జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు) యునైటెడ్ స్టేట్స్‌లో నివసించడానికి అనుమతిస్తుంది. కానీ వారు అమెరికాలో ఎలాంటి పని చేయలేరు. ఇప్పుడు, కొన్ని పరిస్థితులలో, వారి జీవిత భాగస్వామి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసి ఉంటే H-4 వీసాదారులు కూడా పని చేయడానికి అనుమతించడం జరుగుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *