ప్యాన్ ఇండియన్ సినిమా పోయి.. ప్యాన్ వరల్డ్ బొమ్మ వచ్చిందిప్పుడు. అందుకే హాలీవుడ్‌తో పోటీ పడాలన్నపుడు మన కటౌట్స్ కూడా అలాగే ఉండాలి కదా..! అదే చేస్తున్నారు మన హీరోలిప్పుడు.
ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒక్కో సినిమా కోసం మన హీరోలు మారిపోతున్న తీరు అద్భుతహ. టాప్ స్టార్స్ అంతా ఇదే చేస్తున్నారు.బాహుబలి నుంచి ప్రభాస్ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్నారు.
సాహో కోసం సన్నగా మారిన రెబల్ స్టార్.. రాధే శ్యామ్ కోసం రొమాంటిక్ టచ్ ఇచ్చారు. ఇక సలార్, కల్కిలో రఫ్ లుక్‌లోకి మారిపోయిన ప్రభాస్.. రాజా సాబ్ కోసం వింటేజ్ మేకోవర్ అయ్యారు. ఫౌజీలోనూ బరువు తగ్గి కొత్తగా కనిపించబోతున్నారీయన. స్పిరిట్ కోసం పోలీస్ లుక్‌లోకి మారిపోనున్నారు.
రామ్ చరణ్ సైతం పెద్ది కోసం ఎవరూ ఊహించని లుక్‌లోకి మారిపోయారు. ముక్కుకు పోగు.. గుబురు గడ్డం.. మీసాలు, కండలు తిరిగిన దేహం అన్నీ చూస్తుంటే అబ్బో మామూలుగా లేవు. పెద్ది పాత్రను పూర్తిగా ఓన్ చేసుకుని మేకోవర్ అయిపోయారు చరణ్. ఇక ప్యారడైజ్ కోసం ప్రాణం పెడుతున్నారు నాని. ఈయన మేకోవర్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది ఫ్యాన్స్‌కు.
SSMB29 కోసం బాగా మేకోవర్ అయిపోయారు మహేష్ బాబు. ఈయన లేటెస్ట్ లుక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పైగా అక్కడున్నది రాజమౌళి కాబట్టి ఓ పట్టాన వదలరు. రాహుల్ సంక్రీత్యన్ సినిమాలో యుద్ధ వీరుడి పాత్రలో కనిపించబోతున్నారు విజయ్ దేవరకొండ. జూనియర్ ఎన్టీఆర్ సైతం డ్రాగన్ కోసం కష్టపడుతున్న వీడియో వైరల్ అవుతుందిప్పుడు.