కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో పేద కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రవేశపెట్టింది. ఏడాదికి కేవలం రూ.20 చెల్లిస్తే ఏకంగా రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తోంది. ఏడాదికోసారి రూ.20 చెల్లిస్తూ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో 18 ఏళ్ల వయసు వచ్చిన వారి నుంచి 70 ఏళ్ల వయసు వారు చేరేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణించడం లేదా శ్వాశ్వత వైకల్యం చెందితే రూ.2 లక్షలు కేంద్రం అందిస్తుంది. పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష ఇస్తారు. హత్యకు గురైనా కవరేజీ వర్తిస్తుంది. అయితే, ఆత్మహత్య చేసుకుంటే స్కీమ్ వర్తించదు. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా మూసివేస్తే, ఆటో డెబిట్ కోసం ఖాతాలో నగదు లేకుండా పాలసీ రద్దవుతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన బీమా పథకాలలో ఒకటైన ఈ పథకంలో 2025 మే 9 నాటికి 51.06 కోట్ల సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 1.57 లక్షల మంది చనిపోయిన వారి కుటుంబాలకు 3,121 కోట్ల సాయం అందించటం జరిగింది. పథకంలో చేరిన వారిలో 23.87 కోట్లమంది మహిళలే కాగా, మొత్తం సభ్యుల్లో 73.61% సభ్యులు గ్రామీణ ప్రాంతాల వారే కావటం విశేషం. అయితే.. తగినంత ప్రచారం, అవగాహన లేకపోవడం కూడా చాలా మంది దీనివల్ల లబ్ది పొందటం లేదు. మీరూ ఇంకా ఈ పథకంలో మీ పేరు నమోదు చేసుకోకపోతే మీ బ్యాంకు, పోస్టాఫీసు లేదా ఆన్‌లైన్ పోర్టల్‌ను సందర్శించండి. ఈ చిన్న పెట్టుబడి మీ కుటుంబానికి గణనీయమైన రక్షణను నిర్ధారిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాగులో కొట్టుకుపోతున్న యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే
పాము తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో పెరిగిన దసరా సెలవులు
Maharashtra: ఎట్టకేలకు చిక్కిన మ్యాన్ ఈటర్
ఉద్యోగిని ఆత్మ హత్య.. కుటుంబానికి రూ. 90 కోట్ల పరిహారం