ఇవి పిడికెడు గింజలు కేజీ మటన్ తో సమానం..! ఔషద గుణాలు, లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరండోయ్…

ఇవి పిడికెడు గింజలు కేజీ మటన్ తో సమానం..! ఔషద గుణాలు, లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరండోయ్…


బొబ్బర్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బొబ్బర్లలో విటమిన్‌ ఎ, బి1, బి2, బి3, బి5, బి6, సి, ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటాయి. వీటిలో రాగి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్ వంటి మూలకాలు సైతం లభిస్తాయి. రోజూ ఒక క‌ప్పు బొబ్బ‌ర్ల‌ను నాన‌బెట్టి వాటిని ఉడికించి తింటే అనేక లాభాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు బొబ్బ‌ర్ల‌లో ఉంటాయి. వీటిని ఉడ‌క‌బెట్టి తింటే ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది కడుపు నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది. ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌దు. త‌క్కువ‌గా తింటారు. ఫలితంగా బరువుతగ్గుతారు.

బొబ్బ‌ర్ల‌లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది గ‌ర్భిణీల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. గ‌ర్భంలో శిశువు ఎదుగుద‌ల‌కు స‌హాయ ప‌డుతుంది. వీటితో ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. బొబ్బర్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేయ‌డంతోపాటు అంత‌ర్గ‌తంగా ఉండే వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సిలు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి, మెరిసే, ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు. రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది.

బొబ్బ‌ర్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. 1 క‌ప్పు బొబ్బ‌ర్ల‌ను తిన‌డం వ‌ల్ల 194 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. ఈ ప‌ప్పును తింటే ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బొబ్బ‌ర్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూరం చేస్తుంది.. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం తగ్గుతుంది. బొబ్బ‌ర్ల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *