Andhra: ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు.. ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. సీన్ కట్ చేస్తే.!

Andhra: ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు.. ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. సీన్ కట్ చేస్తే.!


ఆన్ లైన్‌లో న్యూడ్ వీడియోలతో పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన భార్య భర్త మల్లేష్, మేరీ.. మల్లేష్ ప్రియురాలు మల్లిక అక్రమంగా డబ్బులు సంపాదించాలని కుట్ర పన్ని ట్విట్టర్‌లో సంయుక్త రెడ్డి అని ఓ ఐడీ ఓపెన్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ప్రజలను మోసం చేశారని కర్నూలు సీఐ నాగరాజరావు తెలిపారు.

ఈ క్రమంలో కర్నూలుకు చెందిన శ్రావణ్ అనే వ్యక్తిని ట్విట్టర్ వేదికగా పరిచయం చేసుకుని విలువైన పొలాలు తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి 3 కోట్ల 80 లక్షల రూపాయలు అకౌంట్‌లో వేయించుకున్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 41 లక్షల రూపాయలు విలువ చేసే కార్లు, ద్విచక్ర వాహనం, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 3 కోట్ల 38 లక్షల రూపాయలు జల్సాలకు ముగ్గురు ముఠా సభ్యులు వాడుకున్నారని సీఐ తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *