Viral Video: మీ వెన్నులో వణుకు పుట్టించే హృదయ విదారకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు షాక్‌కు గురవుతారు. అయ్యో పాపం అనక మానరు. వైరల్ వీడియోలో ఒక యువకుడు, ఒక చిన్నారిపై భారీ గేట్ పడటం అందరిని షాక్‌కు గురి చేస్తుంది. ఆడుకుంటున్న చిన్నారి గేటు బయటకు వెళ్లకుండా తండ్రి గేటును వేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరుగుతుంది. గేటు పూర్తిగా వేసిన తర్వాత ఒక్కసారిగా చిన్నారి, తండ్రిపై పడుతుంది. దీంతో వాళ్లిద్దరు గేటు కింద నలిగిపోతారు. ఈ ప్రమాదకరమైన సంఘటన కేవలం సెకన్లలోనే ఆ కుటుంబ జీవితాన్ని మార్చివేసేది.
ఇది కూడా చదవండి: Smart Tvs: కళ్లు చెదిరే ఆఫర్లు.. 70 శాతం డిస్కౌంట్‌తో స్మార్ట్ టీవీలు!
ఇవి కూడా చదవండి
ఆ భారీ గేటు అకస్మాత్తుగా వారిపై పడిపోవడంతో వెంటనే అక్కడున్న వారు కాపాడేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు వారు గేటును పైకి ఎత్తడంతో చిన్నారిని బయటకు లాగారు. తర్వాత ఆ తండ్రి కూడా గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియో అక్కడి సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది.
सिर्फ़ कुछ सेकंड और ज़िंदगी बदल सकती थी..
गेट गिरते ही दिल रुक सा गया, लगा अब सब ख़त्म,पर ऊपरवाले ने बचा लिया.. pic.twitter.com/IZFBb4ZjSK— Saddam Ansari (@SaddamUnfiltere) September 19, 2025
ఇది కూడా చదవండి: LPG Cylinders: సెప్టెంబర్ 22 తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయా?
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి