Motishwar Mandir: ఏడాదిలో అద్భుతం ఈ శివాలయం.. ఏడాది పొడవున్నా నీటితో ఉండే బావి..

Motishwar Mandir: ఏడాదిలో అద్భుతం ఈ శివాలయం.. ఏడాది పొడవున్నా నీటితో ఉండే బావి..


ఒమన్‌లో ముస్లిం దేశం. ఇక్కడ అధిక సంఖ్యలో ముస్లింలు జనాభా నివసిస్తున్నారు. తక్కువ సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించే వారున్నారు. అయితే ఈ దేశంలో రెండు హిందూ దేవాలయాలు అధికారికంగా గుర్తించబడ్డాయి. ఈ రెండు దేవాలయాలలో ఒకటి మస్కట్‌లోని శివాలయం ( మోతీశ్వర్ ఆలయం). మరొకటి మస్కట్‌లోని కృష్ణ ఆలయం. మోతీశ్వర ఆలయం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిర్మించిన హిందూ దేవాలయం. దీనిని 20వ శతాబ్దం ప్రారంభంలో భారతీయ వ్యాపారులు నిర్మించారు. ఇది మస్కట్‌లోని ముత్రా ప్రాంతంలోని అల్ ఆలం ప్యాలెస్ సమీపంలో ఉంది. ఈ రోజు ఈ మోతీశ్వర శివాలయం.. ఈ ఆలయం వెనుక ఉన్న నమ్మకాల గురించి తెలుసుకుందాం..

ఒమన్ లోని మోతీశ్వర శివాలయం
మోతీశ్వర మహాదేవ్ ఆలయం అని కూడా పిలువబడే శివాలయం.. ఒమన్ రాజధాని మస్కట్‌లో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది 100 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని .. 1900 ప్రాంతంలో గుజరాతీ వ్యాపారులు దీనిని నిర్మించారని చెబుతారు. ఇది శ్రీ ఆది మోతీశ్వర మహాదేవ, శ్రీ మోతీశ్వర మహాదేవ , హనుమంతుడు ప్రధానంగా పూజలను అందుకుంటున్నా.. ఆ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇది మధ్యప్రాచ్యంలోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి.

ఇది గుజరాత్ కు సంబంధించినది.
స్థల పురాణం ప్రకారం.. మోతీశ్వర శివాలయాన్ని గుజరాత్‌లోని భాటియా సమాజం నిర్మించింది. ఈ ఆలయం భారతదేశంతో బలమైన సాంస్కృతిక సంబంధాలు, సోదరభావానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి, శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి, శ్రావణ మాసం , గణేష్ చతుర్థి వంటి పండుగలను ఈ ఆలయంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భారీ పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఏడాది పొడవునా నీటితో ఉండే బావి
మస్కట్ అనేది చాలా తక్కువ వర్షపాతం ఉన్న ఎడారి. అయినప్పటికీ.. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న బావిలో ఎల్లప్పుడూ నీరు ఉంటుంది. దీనిని ప్రజలు ఒక అద్భుతంగా భావిస్తారు. నిజానికి ఈ బావిలో తప్ప సమీపంలో కూడా మరెక్కడా నీరు నిల్వ ఉండదు. అందుకే అక్కడ ప్రజలు ఆలయంలోని బావిని ఓ అద్భుతంగా భావిస్తారు.

ఒమన్ లోని శ్రీ కృష్ణ దేవాలయం

ఒమన్‌లో గుర్తింపు పొందిన రెండవ హిందూ దేవాలయం మస్కట్‌లో ఉన్న శ్రీ కృష్ణ దేవాలయం.

ఈ కృష్ణ ఆలయం మోతీశ్వర శివుడి ఆలయం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది .

ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది భక్తులకు మానసిక శాంతి, ప్రశాంతతను అందిస్తుంది.

ఈ ఆలయం ఒమన్‌లో నివసిస్తున్న హిందువులకు మతపరమైన, సాంస్కృతిక కేంద్రం .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *