Little Hearts: లిటిల్ హార్ట్స్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో..

Little Hearts: లిటిల్ హార్ట్స్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో..


టీచర్స్ డే కానుకగా సెప్టెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటి వరకు సుమారు రూ. 40 కోట్ల దాకా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. ఈ విషయం పక్కుకు పెడితే… ప్రస్తుతం థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోన్న ఈ లిటిల్ హార్ట్స్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. లిటిల్ హార్ట్స్ సినిమాలో మౌళి తండ్రిగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల నటించారు. అయితే మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు సాయి మార్తాండ్ వేరొకరిని అనుకున్నారట. ఈ రోల్ కోసం జగపతిబాబును తీసుకోవాలనుకున్నాడట. ఆయనకు స్క్రిప్ట్‌ కూడ వినిపించారట. జగ్గూభాయ్ కు కూడా సినిమా కథ పిచ్చిపిచ్చిగా నచ్చేసిందట. అయితే అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ తో లిటిల్ హార్ట్స్ సినిమాలో జగపతి బాబు నటించలేకపోయారట. ఇక ఈ విషయాన్ని దర్శకుడు సాయి మార్తాండ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జగపతి బాబు సినిమా చేయలేకపోయినా, ఆయన ఇచ్చిన సూచన వల్లే స్క్రిప్ట్ బాగా వచ్చింది. కథలో ఉన్న చిన్న లోపాన్ని చూపించి, మాకు గొప్ప మార్గనిర్దేశం చేశారాయన. అందుకు నేను ఆయనకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను అంటూ… లిటిల్ హార్ట్స్ ఈవెంట్‌లోనే చెప్పుకొచ్చారు ఈ యంగ్ డైరెక్టర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

థార్‌ కారులో ఫుడ్‌ డెలివరీ.. షాకైన కస్టమర్‌

వీధి కుక్కలపై వింత నిర్ణయం రెండు సార్లు కరిస్తే.. జీవిత ఖైదే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *