క్రూరమైన సింహానికి దొరికిన జింకపిల్ల..! ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..

క్రూరమైన సింహానికి దొరికిన జింకపిల్ల..! ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..


సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక సింహం చిన్న జింక పిల్ల పట్ల ఎంతగా ప్రేమను చూపిస్తుందో చూసిన ప్రతి ఒక్కరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది.. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @AmazingSights అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక క్రూరమైన సింహం జింకపిల్లను తన సొంత బిడ్డలాగా ముద్దు చేస్తున్నట్లు కనిపిస్తుంది. సింహం తన నాలుకతో ఆ జింకపిల్లను లాలించడం. దానిని ముద్దు చేయడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆ జింకను వేటాడేందుకు బదులుగా ఆ సింహం దానిని తన సొంత బిడ్డలా ప్రేమిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. చాలా మంది ఈ వీడియోపై వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఆ సింహం ప్రేమను చూపిస్తుంది. ఆమె తన నాలుకతో ఆ పిల్ల జింకను లాలిస్తోంది. తల్లి తన బిడ్డను లాలించినట్లే ఆ సింహం కూడా ఆ పిల్ల జింకను అలాగే చూసుకుంటుంది. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఆ సింహం తన దంతాలతో గాయపడకుండా ఆ పిల్ల జింకను జాగ్రత్తగా నోటిలో పట్టుకుని తీసుకువెళ్తోంది. ఆ సింహానికి ఏమైందో తెలియక, తాను ఎంతకాలం సింహం చేతిలో జీవించి ఉంటానో తెలియక, జింక కూడా దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అడవి జంతువులు కూడా కొన్నిసార్లు మానవ భావోద్వేగాలను ప్రదర్శించగలవని ఈ వీడియో రుజువు చేస్తుంది. అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటైన ఒక సింహం, తన సహజ స్వభావాన్ని పక్కనపెట్టేసి, దుర్బలమైన జింకను చూసుకుంది. అయితే చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఈ అనురాగం ఎంతకాలం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఆ సింహం జింకను ప్రేమిస్తూనే విందు కోసం సిద్ధం చేస్తోందని అంటున్నారు. అది ఏ క్షణంలోనైనా దానిని చంపి తినవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *