Soaked Cashew Nuts: నానబెట్టిన జీడి పప్పు ఆరోగ్యానికి ఓ వరం.. కండిషన్స్ అప్లై..

Soaked Cashew Nuts: నానబెట్టిన జీడి పప్పు ఆరోగ్యానికి ఓ వరం.. కండిషన్స్ అప్లై..


జీడిపప్పు ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. జీడిపప్పు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే మంచి కొవ్వులు వీటిలో ఉండటం వలన గుండె ఆరోగ్యానికి మంచివి. జీడిపప్పు మనస్సును పదును పెట్టడానికి , జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. పరిమిత పరిమాణంలో క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం వల్ల మెరిసే చర్మం మీ సొంతం. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అందువల్ల ప్రతిరోజూ తక్కువ పరిమాణంలో జీడిపప్పు తినడం చాలా అవసరం. అయితే జీడిపప్పుని నానబెట్టి క్రమం తప్పకుండా తింటే కలిగే ప్రయోజనాలు అనేకం.. అవి ఏమిటంటే..

గుండెను ఆరోగ్యం కోసం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పులో లభించే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి. ఎవరైనా ఎక్కువ కాలం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఉదయం నానబెట్టిన జీడిపప్పును తినాలి.

బరువు తగ్గడంలో సహాయం.. ఎవరైనా అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటే.. నానబెట్టిన జీడిపప్పును కూడా తినాలి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరం: జీడిపప్పులో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయని నిపుణులు అంటున్నారు. కనుక రోజూ పరిమిత సంఖ్యలో జీడిపప్పుని నానబెట్టుకుని తినడం మంచిదని చెబుతున్నారు.

మెరిసే చర్మం కోసం: మెరిసే చర్మం కోరుకునే వారు నానబెట్టిన జీడిపప్పులను క్రమం తప్పకుండా తినడం ప్రారంభించాలి. వీటిని తినడం ప్రారంభించిన తర్వాత.. తక్కువ సమయంలోనే చర్మ నాణ్యతలో కనిపించే మార్పును గమనిస్తారు.

రక్తపోటు నియంత్రణ: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నానబెట్టిన జీడిపప్పులో పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరైనా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటే.. ఖచ్చితంగా నానబెట్టిన జీడిపప్పును తినాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *