Andhra: ఆ నెయ్యి తిన్నారో.. పోయారే.! చూసి అధికారులకే గుండె ఆగినంత పని అయింది

Andhra: ఆ నెయ్యి తిన్నారో.. పోయారే.! చూసి అధికారులకే గుండె ఆగినంత పని అయింది


విశాఖలో కల్తీ నెయ్యి తయారీ ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ అధికారులు బయటపెట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగారు. అక్కడ నెయ్యి తయారీ విధానాన్ని చూసి నిర్ఘంతపోయారు అధికారులు. ఓ లాడ్జిలో గదిని అద్దెకి తీసుకుని.. ఓ కుటీర పరిశ్రమని ఏర్పాటు చేసి.. ఏకంగా కల్తీ నెయ్యిని తయారుచేస్తుంది ఓ ముఠా. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ పూర్ణ మార్కెట్.. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. మార్కెట్ సమీపంలోని విశ్రాంత్ లాడ్జిలో జరుగుతుంది ఈ కల్తీ నెయ్యి వ్యవహారం. బళ్లారికి చెందిన లక్ష్మీపతి, శ్రీధర్, రాజశేఖర్ విశాఖలో వాలిపోయారు. బెంగళూరు నుంచి.. ఓ రకమైన క్రీమును దిగుమతి చేసుకున్నారు. వనస్పతి, క్రీమ్ ను మరగబెట్టి.. కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. సువాసన వచ్చేందుకు ఎసెన్స్, నెయ్యిల రంగు కనిపించేందుకు కలర్ను వాడుతున్నారు. నెయ్యి క్రీము కలిపి కొంతసేపు వేడి చేసిన తర్వాత.. వాటిలో రంగు రసాయనం వేసి నెయ్యిని సిద్ధం చేస్తున్నారు. వాటిని బాటిల్స్ లోనూ, పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు.

ఆవు నెయ్యిగా అమ్మకాలు..!

తయారు చేసిన కల్తి నెయ్యిని.. క్యాటరింగ్ ఏజెన్సీలకు అమ్మేస్తున్నారు. రెస్టారెంట్లకు, బేకరీలకు, స్వీట్ షాపులకు అమ్ముతున్నట్లు అధికారులు ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారు. కిలో 350 నుంచి 400 ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 120 కిలోల నకిలీ నెయ్యి గుర్తించారు సీజ్ చేశారు అధికారులు. ఏడాది నుంచి గుట్టుచప్పుడు కాకుండా కల్తీ నెయ్యి దందాకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ భరత్ అన్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు.

సువాసన మాత్రం సూపర్.. కానీ ఈ నెయ్యి తింటే గుండె ఆగిపోవడం ఖాయం..

స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా అమ్మకాలు చేస్తున్న ఈ కల్తి నెయ్యి తయారీ వ్యవహారం చూసి అధికారులే విస్తుపోయారు. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు.. వనస్పతి క్రీమ్ రసాయనాలు కలిపి నెయ్యి తయారీ అధికారులకే ఉలిక్కిపడేలా చేసింది. ఇటువంటి కల్తీ నెయ్యిలో అధిక మోతాదులో కొవ్వు ఉంటుందని, రసాయనాలు రంగులు కలిపిన ఈ నెయ్యి తింటే.. గుండె జబ్బులు రావడం ఖాయం అని అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎటువంటి నెయ్యిని ఎక్కువ మోతాదులో పదేపదే తింటే గుండె ఆగిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్.

ఆవు నెయ్యి అని అమ్మేస్తున్నాం..!

‘మేం బళ్లారి నుంచి వచ్చాం.. తయారీని అక్కడే నేర్చుకున్నాం.. బెంగళూరు నుంచి కొన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం.. ఏడాదిలో కొన్నిసార్లు విశాఖ వచ్చి సీజన్కు అనుగుణంగా నెయ్యిని తయారు చేసి అమ్మకాలు చేస్తున్నాం. కిలో 350 రూపాయల వరకు విక్రయిస్తున్నాం. ఆవు నెయ్యి అని నమ్మించి సేల్ చేస్తున్నాం.’ అని అన్నారు బళ్లారికి చెందిన కల్తీ నెయ్యి ముఠా సభ్యులు లక్ష్మీపతి, శ్రీధర్, రాజశేఖర్. అయితే.. ఈ కల్తీ నెయ్యి తయారీ ముఠాకు స్థానిక నుంచి ఎవరెవరు సహకరిస్తున్నారు అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎంత జరుగుతున్న కనీసం లాడ్జి నిర్వాహకులకు ఎందుకు తెలియడం లేదు అనేది ఇప్పుడు అనుమానిస్తున్నారు. అద్దెను అధికంగా ఆశ చూపడం వల్లే వాళ్లకు నిర్వాహకులు అద్దెకిచ్చేసారా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి ముఠాలకు ఇల్లు అద్దెకిస్తే ఇల్లను కూడా సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *