Gold Rate: కొన్ని గంటల్లోనే తులంపై రూ.820 పెరిగిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి!

Gold Rate: కొన్ని గంటల్లోనే తులంపై రూ.820 పెరిగిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి!


Gold Price: సెప్టెంబర్‌ 20న కొన్ని గంటల వ్యవధిలోనే బంగారం ధరలు షాకిచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఉదయం 6 గంటల సమయానికి దాదాపు 200 రూపాయలకుపైగా పెరిగింది. అదే కొన్ని గంటల వ్యవధి అంటే 11 గంటల సమయానికి తులం బంగారం ధరపై 820 రూపాయలు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,150 రూపాయల వద్ద ఉంది. ఇక 22 క్యారెట్లపై కూడా భారీగా పెరిగింది. దీనిపై 750 రూపాయలు పెరిగింది. దీంతో తులం ధర 1,02,800 వద్ద చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధరపై కూడా పెరిగింది. దీనిపై 610 రూపాయలు పెరిగి ప్రస్తుతం 84,110 రూపాయల వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Pension Scheme: కేవలం రూ.210 డిపాజిట్ చేస్తే చాలు నెలకు రూ.5,000 పెన్షన్‌!

ఇక వెండి కూడా తగ్గేదేలే అన్నట్లు కొనసాగుతోంది. కిలోపై ఏకంగా 2000 రూపాయల వరకు పెరిగింది. పెరిగిన ధరతో ప్రస్తుతం కిలో ధర 1,35,000 రూపాయలకు చేరుకుంది. ఇక హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో అయితే మరింత ఎక్కువగానే ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 1,45,000 రూపాయల వద్ద ఉంది. బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ వెండి ధర కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతున్నాయని గమనించాలి. మీరు బంగారం లేదా వెండి కొనాలని ఆలోచిస్తుంటే మీ కొనుగోలు చేయడానికి ముందు వాటి వాస్తవ ధరలను తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు?

భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, డాలర్-రూపాయి మారకం రేటు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతాయి. భారతీయ సంస్కృతిలో, బంగారాన్ని ఒక ఆభరణాల వస్తువుగా మాత్రమే కాకుండా ముఖ్యమైన పెట్టుబడి, పొదుపు సాధనంగా కూడా పరిగణిస్తారు. వివాహాలు, పండుగల సమయంలో దీనికి అధిక డిమాండ్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: LPG Cylinders: సెప్టెంబర్‌ 22 తర్వాత గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గుతాయా?

బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *