India vs Pakistan Match Start Time Asia Cup 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు మరోసారి ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఎందుకంటే, 2025 ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. ఈసారి చిరకాల ప్రత్యర్థులు సూపర్ 4 దశలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. టోర్నమెంట్‌లోని గ్రూప్ ఏ నుంచి సూపర్ 4 దశకు అర్హత సాధించిన రెండు జట్లు భారత్, పాకిస్తాన్. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ రెండవ సూపర్ 4 మ్యాచ్ అవుతుంది.
సూపర్-4లో భారత్, పాకిస్తాన్ జట్లు..
భారత్, పాకిస్థాన్ రెండూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించగా, పాకిస్తాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, గ్రూప్ దశలో ఆడిన ఒక మ్యాచ్‌లో భారత్‌తో ఓడిపోయింది. సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిస్సందేహంగా పుంజుకోవాలని చూస్తుండగా, మరో విజయంతో ఫైనల్ వైపు తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ చూస్తోంది.
టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్ ఇరుజట్ల మొదటి మ్యాచ్ కంటే మరింత ఆసక్తికరంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, ప్రశ్న ఏమిటంటే ఈ ఉత్తేజకరమైన మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి? ఎలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి
1. ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
2025 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.
2. ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు జరుగుతుంది. టాస్ అరగంట ముందుగా, రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది.
3. ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ ఏ రోజున జరుగుతుంది?
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ సెప్టెంబర్ 21 ఆదివారం జరగనుంది.
4. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్-4 మ్యాచ్ ఏ టీవీ ఛానెల్లో ప్రసారం అవుతుంది?
ఈ మ్యాచ్‌ను టీవీలో చూడాలనుకుంటే, టోర్నమెంట్ అధికారిక ప్రసారకర్త అయిన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ 1, 2, 3, 5 ఛానెల్‌లలో చూడవచ్చు.
5. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్-4 మ్యాచ్ ఏ వేదికపై ఆన్లైన్లో ప్రసారం చేకానుంది?
సెప్టెంబర్ 21న జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆన్లైన్ స్ట్రీమింగ్‌ను Sony Liv యాప్ లేదా వెబ్సైట్లో చూడవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..