ఇదెక్కడి క్రేజ్ స్వామి..! ఓజీ సినిమా టికెట్‌ను రూ. 1లక్షరూపాయిలకు కొన్న అభిమాని

ఇదెక్కడి క్రేజ్ స్వామి..! ఓజీ సినిమా టికెట్‌ను రూ. 1లక్షరూపాయిలకు కొన్న అభిమాని


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. హరిహరవీరమల్లు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోలు, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ బజ్ ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే చిత్తూరులోని ఓ యువకుడు పవన్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. నగరంలోని రాఘవ థియేటర్‌లో ఓజీ సినిమా మొదటి టికెట్‌ను అక్షరాల లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు. ఇక ఆ లక్ష రూపాయలను పవన్ ఆఫీస్‌కు పంపించేందుకు థియేటర్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా డబ్బును పంపించేందుకు సిద్ధమైంది. మరోవైపు టికెట్‌ కొన్న అభిమాని శ్రీరామ్‌లోచన్‌ను పవన్‌ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అభిమానంతో టికెట్‌ కొనడమే కాదు… ఆ డబ్బును గ్రామాభివృద్ధి వాడాలన్న విషయం హర్షనీయం అంటున్నారు.

ఇక ఓజీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా  ‘ఓజీ’ నిర్మాతల విజ్ఞప్తి మేరకు టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ప్రీమియర్స్ షోస్ కు కూడా పర్మిషన్ ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓజీ ప్రీమియర్స్ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100 , మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది సర్కార్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *