మంచు లక్ష్మీకి కోపంతో ఊగిపోయింది. దీనికి కారణం ఓ జర్నలిస్టు అడిగిన.. అత్యంత హేయమైన ప్రశ్న. మంచు లక్ష్మి అంటే.. తెలుగు వారికి సుపరిచితమే. చాలా జోవియల్‌గా ఉంటారు. సరదాగా మాట్లాడతారు. ఎలాంటి విషయాన్నైనా తనదైన శైలిలో స్వీకరిస్తారు. అదే తీరుతో మాట్లాడతారు. కాని.. ఇటీవల ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నతో ఆమె హర్ట్ అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. లక్ష్మీ దక్ష అనే సినిమాలో నటించిన మంచు వారి అమ్మాయి.. ప్రమోషన్ కోసం.. గ్రేట్‌ఆంధ్ర యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. జర్నలిస్టు కమ్ యాంకర్‌గా చేస్తున్న సదరు వ్యక్తి మంచు లక్ష్మి విషయంలో పర్సనల్‌గా వెళ్లారు. వయసు, దుస్తుల విషయంలో ఆ జర్నలిస్టు ప్రశ్నలు అడగడంతో.. మంచులక్ష్మి ఖంగుతిన్నారు. ఈ వయసులో ఈ డ్రెస్సులు వేసుకోవడం ఏంటంటూ ఆ జర్నలిస్టు అడగడంతో ఆగ్రహించిన ఆమె.. ఇదే ప్రశ్న ఓ పెద్ద హీరోని అడగగలరా అంటూ రివర్స్‌లో ప్రశ్నించారు. దీనికి ఆయన తెల్లమొహం వేశారు. కాని.. మంచులక్ష్మి మాత్రం డీప్‌గా హర్ట్ అయ్యారు.
ఆ జర్నలిస్టు వేసిన ప్రశ్న తనను తీవ్రంగా బాధించిందని, వ్యక్తిగత హుందాతనాన్ని దెబ్బతీసేలా ఉందని ఆమె ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది జర్నలిజం కాదని, కేవలం ప్రాచుర్యం పొందడం కోసం, వీడియో వైరల్ కావడం కోసమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె ఆరోపించారు. జర్నలిస్టుల మీద తనకు ఎంతో గౌరవం ఉంది. కానీ ఇది జర్నలిజం కాదు, కనీసం విమర్శ కూడా కాదు. పురుషాధిపత్యం ఉన్న ఈ పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడి నిలదొక్కుకున్నా అంటూ ఫిల్మ్ చాంబర్‌కు చేసిన ఫిర్యాదులో రాసుకొచ్చారు. ఇలాంటి సమయంలో మౌనంగా ఉంటే, భవిష్యత్తులో కూడా ఇదే ప్రవర్తన కొనసాగుతుందని.. ఆ పేరుమోసిన జర్నలిస్టుపై ఫిల్మ్ ఛాంబర్ వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు రాష్ట్ర మహిళా కమిషన్‌కీ ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అసలు యూట్యూబ్ జర్నలిస్టులపై… వారి యాజమాన్యాలపై సినిమా నటులు, సెలబ్రిటీలు గుర్రుగానే ఉన్నారు. లేనిపోని ప్రశ్నలు అడగడమే కాదు.. తప్పుడు కథనాలను ఆన్‌లైన్లో పెట్టడం.. వారికి అలవాటైపోయింది. ఇటీవల నటి గాయత్రి భార్గవి ఓ యూట్యూబ్ చానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూకి సంబంధించిన పెట్టిన థంబ్ నెయిల్ చూసి ఆమె ఫైర్ అయ్యారు. క్లిక్‌బెయిట్స్ కోసం.. పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ పెట్టి తమ పరువు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లే కాదు.. ఇటీవల టాప్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కూడా తన ఫొటోతో ఏఐలో తప్పుడు చిత్రాలను జెనరేట్ చేస్తున్నారంటూ కోర్టులోనే ఈ విషయంపై పోరాడి.. ఆర్డర్స్ తెచ్చుకున్నారు. తమిళనటి ఐశ్వర్య లక్ష్మీ కూడా వెబ్‌సైట్ల తప్పుడు కథనాలకు బాధితురాలిగా మిగిలారు. ఆమె సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీని తట్టుకోలేక.. వాటి నుంచి వైదొలిగి ప్రశాంతంగా ఉంటానంటూ ప్రకటించారు. ఇలా.. యూట్యూబ్ చానళ్లు, వెబ్‌సైట్లు.. పార్ట్‌టైమ్ జర్నలిస్టుల వల్ల సెలబ్రిటీలు, నటులు, ఆఖరికి సాధారణ ప్రజలు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వీరి ఆగడాలు ఇంకెన్నిరోజులు సాగుతాయి?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి