బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మధ్య గట్టిగానే రచ్చ జరిగింది. నిన్న టెనెంట్స్‌లో ఒకరికి ఓనర్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకోసం ఒక టాస్క్ ఇచ్చాడు. ఈసారి టెనెంట్స్ గ్రూప్ కోసం కాకుండా తమ కోసం టాస్క్ ఆడాల్సి ఉంటుంది అని అనౌన్స్ చేశాడు. ఎవరైతే గెలుస్తారో వారు టెనెంట్ నుంచి ఓనర్ గా మారిపోతారు అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్ దాంతో సెలబ్రెటీలంతా సిద్ధమయ్యారు. అయితే ఓనర్స్ గా ఉన్నవారిలో ఇద్దరు కొన్ని బొమ్మలను విసిరేస్తుంటారు. ఆ బొమ్మలను టెనెంట్స్ పట్టుకొని జాగ్రత్తగా దాచుకోవాలి. ఆతర్వాత వారికి ఇచ్చిన బాక్స్ ల్లో జాగ్రత్తగా దాచుకోవాలి.. ఈ టాస్క్ కొన్ని రౌండ్స్ గా జరుగుతాయి.
ఒకొక్క రౌండ్ లో ఎవరి దగ్గరైతే తక్కువ బొమ్మలు ఉంటాయో వారు అవుట్ అవుతారని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. మొదటి రౌండ్ లో బజర్ మోగగానే.. ఫ్లోరా షైనిని టార్గెట్ చేశాడు రాము రాథోడ్. ఆమె బాస్కెట్లో బొమ్మలు తీయడానికి ప్రయత్నించాడు. ఇంతలో రాము ను టార్గెట్ చేసింది సంజన.. రాము బొమ్మలను తొలగిస్తుంటే.. సంజన బొమ్మలను తీయడానికి ప్రయత్నించింది రీతూ చౌదరి. దాంతో తన బాస్కెట్ ఖాళీ అవుతుంటే.. ఫ్లోరా రీతూ బొమ్మలు తీయడానికి ప్రయత్నిచింది.
ఇక బయట ఉన్న ఓనర్స్ వాళ్ల బొమ్మలు తీసేయండి.. వీరి బొమ్మలు లాక్కోండి అంటూ అరవడంతో రీతూ వారిపై సీరియస్ అయ్యింది. అయితే సుమన్ శెట్టి తనూజ బాస్కెట్లో బొమ్మలు తీయకుండా చూస్తూ ఉండిపోయాడు. బజర్ మోగే సమయానికి ఫ్లోరా దగ్గర తక్కువ బొమ్మలు ఉండటంతో ఫ్లోరా అవుట్ అయ్యింది. ఫ్లోరా ఔట్ కాగానే వాలంటరీగా సంజన కూడా గేమ్ నుంచి క్విట్ అవుతున్నా అంటూ చెప్పేసింది. ఇద్దరూ తప్పుకున్నారు. రెండో రౌండ్ మొదలుకాగానే సంజన, ఫ్లోరా కలిసి సుమన్ శెట్టి.. డిఫెండ్ చేసుకునే క్రమంలో సుమన్ చెయ్యి ఫ్లోరాకు తగిలింది. దాంతో కొడితే అవుట్ అంటూ సంచలక్ గా ఉన్న ప్రియా సుమన్ ను అవుట్ అని అనౌన్స్ చేసింది. నేను కొట్టలేదు అని సుమన్ అంటున్నా లేదు కొట్టారు మీరు ఎలిమినేట్ అంటూ చెప్పింది ప్రియా.. దీంతో కోపమొచ్చి బాస్కెట్‌ని తన్నేశాడు సుమన్ శెట్టి. సంజన రీతూని టార్గెట్ చేసింది. రీతూ కూడా డిఫెండ్ చేసుకునేటప్పుడు కొట్టినా సంచాలక్ ప్రియ ఔట్ చేయలేదు.రీతూ నన్ను కొట్టింది.. అయినా ఎందుకు ఔట్ చేయలేదు అని గట్టిగానే అడిగింది సంజన. దాంతో రీతూ , సంజన మధ్య వాదన జరిగింది. అలాగే ప్రియా, సంజన మధ్య కూడా గట్టిగానే జరిగింది. ఇప్పుడే కౌంట్ చేస్తా అన్నారు.. రీతూది తక్కువ ఉందని కౌంట్ చేయట్లేదు అంటూ సంజన సీరియస్ అయ్యింది. మూడో రౌండ్ మొదలవ్వగానే.. సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి ముగ్గురూ కలిసి రీతూనే అటాక్ చేశారు. రీతూ బాక్స్ ఖాళీ చేసి తనూజ, రాము, ఇమ్మూకి ఇచ్చేశారు. ఆతర్వాత రీతూ వెళ్లి రాము బాస్కెట్లో వస్తువులన్నీ తన దాంట్లో వేసేసుకుంది. అయినా రాము అలా చూస్తూ ఉండిపోయాడు. ఆతర్వాత రాము దగ్గర ఉన్నయన్నీ ఎందుకు తీసేసావ్.. పాపం వాడు నీకోసం ఎలిమినేట్ అవుతాడు అని ఇమ్మాన్యుయేల్ అంటే దానికి అడ్డదిడ్డంగా వాదించింది రీతూ.. నీది నువ్వు చూసుకో అయ్యా.. నాకు తెలుసు ఎలా ఆడాలో.. నువ్వు ఇప్పుడొచ్చి రేలంగి మావయ్యలాగ మాట్లాడకు.. అంటూ పొగరుగా డైలాగ్ వేసింది. దానికి ఇమ్మూ కూడా గట్టిగానే ఇచ్చాడు. నా గురించి తెలీదు కానీ నువ్వు మాత్రం రేలంగి అత్తయ్యవే.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ఇమ్మూ.. రౌండ్ మళ్లీ మొదలుకాగానే రీతూ.. తనూజనే అటాక్ చేసింది.తనూజ కూడా ఔట్ కావడంతో ఇక చివరికి ఇమ్మూ, రాము ఇద్దరే మిగిలారు. చివరిగా మిగిలిన రాము, ఇమ్మూ నుంచి ఓనర్‌గా మారి హౌస్‌లోకి వెళ్లేదెవరో టెనెంట్స్ నాకు చెప్పండి అని బిగ్ బాస్ అన్నాడు. దాంతో పెద్ద వాదన తర్వాత రాము పేరు చెప్పారు. అలా ఈసారి ఓనర్ గా రాము హౌస్ లోకి వెళ్ళాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి