
హైదరాబాద్ లో నిన్న సాయంత్రం మళ్ళీ భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హదరాబాద్ లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక పక్క ఎండగా ఉన్నప్పటికీ వర్షం కురుస్తూ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ వర్షం క్రమంగా సిటీ మొత్తం వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీలో కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.