Headlines

Video: టీచర్‌తో డ్యాన్స్ వీడియో వైరల్.. ‘జెన్ జీ టీచర్’ అంటూ ప్రశంసలు!


Nepal Teacher Dance With Students Viral Dilruba Dilnasheen Lyricist Wins Hearts With His Reaction

నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా ఎవరెస్ట్ అకాడమీ పదంపోఖరి పాఠశాలలో సీమా పనిచేస్తున్నారు. తన విద్యార్థులతో కలిసి తరచూ డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల ‘దిల్‌రుబా దిల్‌నషీన్’ అనే హిందీ పాటకు విద్యార్థులతో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. పాఠశాల గేటు బయట రోడ్డుపైనే ఈ డ్యాన్స్ చేశారు. టీచర్ ముందుండి స్టెప్పులు వేస్తుంటే చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఆమెను అనుసరించారు. అయితే ఈ వీడియోలో అందరినీ ఆకట్టుకున్నది కేవలం టీచర్ డ్యాన్స్ మాత్రమే కాదు పిల్లల ఎనర్జీ కూడా. కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా, సిగ్గుపడకుండా చిన్నారులు ఎంతో కాన్ఫిడెంట్‌గా స్టెప్పులేశారు. పాటకు అనుగుణంగా చక్కగా డ్యాన్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పాటల రచయిత సైతం స్పందన

ఈ వీడియో వైరల్ కావడంతో పాటల రచయిత సిద్ధాంత్ కౌశల్ (Siddhant Kaushal) దృష్టికి కూడా వచ్చింది. ‘దిల్‌రుబా దిల్‌నషీన్’ పాటకు ఆయనే సాహిత్యం అందించారు. ఈ పాటను రితో రిబా ఆలపించారు. వీడియో చూసిన సిద్ధాంత్ సీమాకు ప్రత్యేకంగా సందేశం పంపించారు. తన పాటకు ఇంతటి ప్రేమను అందించినందుకు టీచర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారులు తన పాటలోని పదాలకు అనుగుణంగా లిప్‌సింక్ చేస్తూ కనిపించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన విషయమని అన్నారు. టీచర్‌తో పాటు చిన్నారులకీ శుభాకాంక్షలు తెలిపారు.

Nepal Teacher and Students’ Energetic Dance to ‘Dilruba Dilnasheen’ Goes Viral Songwriter Reacts

పిల్లల ఎనర్జీకి నెటిజన్లు ఫిదా!

ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. టీచర్‌తో కలిసి పిల్లలు ఇంత ఆనందంగా డ్యాన్స్ చేయడం చూడటానికి ఎంతో బాగుందని కామెంట్లు చేస్తున్నారు. సీమా విద్యార్థులతో ఇంత మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సీమా పక్కనే నిలబడి డ్యాన్స్ చేసిన ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. సీమాను ‘జెన్ జీ టీచర్’ అంటూ అభివర్ణించారు. పిల్లలతో కలిసి వారి స్థాయిలో, వారి ఉత్సాహానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేయడం గొప్ప విషయమని అన్నారు. వీడియో చూసిన చాలామంది తమ పాఠశాల రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తమకు కూడా ఇలాంటి టీచర్ ఉండి ఉంటే ఎంత బాగుండేదోనని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఆ పాఠశాలలో కొత్త అడ్మిషన్లు తీసుకుంటున్నారా? అంటూ సరదాగా ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా సోషల్ మీడియాలో వివాదాలు, సంచలన వార్తలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ ఎలాంటి హడావుడి, వివాదం లేకుండా ఓ టీచర్, కొంతమంది చిన్నారులు కలిసి చేసిన ఈ డ్యాన్స్ ఎంతో మందికి ఆనందాన్ని పంచుతోంది. చదువుతో పాటు పిల్లలతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా ఉపాధ్యాయుల బాధ్యతలో ముఖ్యమైన భాగమేనని ఈ వీడియో మరోసారి గుర్తుచేస్తోంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *