Headlines

Suryakumar Yadav: ఐదేళ్లు ఆడించి ఒక్కసారిగా పక్కన పెట్టారు.. కానీ నా టార్గెట్ అదేనంటున్న సూర్యాభాయ్


Suryakumar Yadav: టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. వరుసగా ఐదేళ్ల పాటు జాతీయ జట్టులో ఆడిన తర్వాత ఒక్కసారిగా చోటు కోల్పోవడం తనకు బాధ కలిగించిందని సూర్య చెప్పాడు. అయితే భారత జట్టులోకి తిరిగి రావాలనే ఆశను మాత్రం వదులుకోలేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు.

జట్టుకు దూరం కావడం బాధ కలిగించింది

భారత జట్టులో చోటు కోల్పోవడంపై సూర్యకుమార్ స్పందించాడు. ఐదేళ్ల పాటు వరుసగా ఆడిన తర్వాత అకస్మాత్తుగా జట్టుకు దూరం కావడం బాధ కలిగిస్తుందని చెప్పాడు. అయితే క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితులు సహజమని, ఆటగాడికి ఎన్నో విషయాలు నేర్పిస్తాయని తెలిపాడు. గత రెండేళ్లలో, ఐపీఎల్ తర్వాత కూడా తాను చాలా విషయాలు నేర్చుకున్నానని వివరించాడు. ప్రతి కష్టంలోనూ ఓ ఆశ ఉంటుందని, ఆ నమ్మకంతో ఆటను కొనసాగించాలని చెప్పాడు.

ప్రస్తుతం ముస్తాక్ అలీ ట్రోఫీపైనే దృష్టి

తన భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని సూర్య స్పష్టం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీపై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలిపాడు. ఈ టోర్నీలో సూపర్ లీగ్ మ్యాచ్‌లు గెలిచి చివరకు టైటిల్ సాధించడమే తన లక్ష్యమని చెప్పాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ తర్వాత విజయ్ హజారే ట్రోఫీ, ఆ తర్వాత రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఉన్నాయని గుర్తు చేశాడు. ఐపీఎల్ ఇంకా చాలా దూరంలో ఉందని, ప్రస్తుతానికి ప్రతి మ్యాచ్‌లో గెలవడమే ముఖ్యమని పేర్కొన్నాడు.

ఎక్కువమంది చదివినది: శ్రీలంక సిరీస్‌కు భారత జట్టు.. సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం..!

బ్యాటింగ్‌లో ఎలాంటి సమస్య లేదు

తన బ్యాటింగ్‌లో ఎలాంటి లోపం లేదని సూర్యకుమార్ అభిప్రాయపడ్డాడు. గత ఐదేళ్లుగా తాను ఇదే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నానని చెప్పాడు. భారత జట్టు తరఫున ఆడినా, ముంబై తరఫున బరిలోకి దిగినా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానని తెలిపాడు. జట్టులో చోటు కోల్పోయినంత మాత్రాన తన ఆటతీరుపై నమ్మకం తగ్గలేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

టీ20ల్లో సూర్య రికార్డులు ఎలా ఉన్నాయంటే?

సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడాడు. టెస్టుల్లో ఒక మ్యాచ్ ఆడి 8 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో 37 మ్యాచ్‌లు ఆడారు. అయితే గణాంకాల విభాగంలో 33 మ్యాచ్‌ల్లో 773 పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం సూర్యకు మంచి రికార్డు ఉంది. 113 మ్యాచ్‌ల్లో 107 ఇన్నింగ్స్ ఆడి 3,272 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 117 పరుగులు అతడి హయ్యస్ట్ స్కోర్. 162.9 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన సూర్య, టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో రాణించి మళ్లీ భారత జట్టులో చోటు సంపాదించడమే అతడి ముందున్న లక్ష్యం.

ఎక్కువమంది చదివినది: IND vs NZ: 91 బంతుల్లో 12 పరుగులు.. టెస్టు క్రికెట్‌ హిస్టరీలో చెత్త రికార్డులో టీమిండియా జోడీ..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *